Ads
ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిళ్లు బాగా ఎక్కువయ్యాయి కానీ ఇది వరకు పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళని అందరూ చేసుకునేవారు. ప్రేమ పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళు జాతకాలని వాటిని పట్టించుకోరు. కానీ పెద్దలు కుదుర్చుకున్న పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళు జాతకాలని కచ్చితంగా చూపిస్తారు.
జాతకాలు నప్పితేనే పెళ్లి చేసుకుంటారు. అయితే ఎప్పుడైనా మీకు అనుమానం వచ్చిందా..? జాతకాలు నప్పినా సరే భార్య భర్తలు పెళ్లి అయిన కొన్నాళ్ళకి కానీ కొద్ది రోజులకి కానీ ఎందుకు విడిపోతారు అని…
జాతకాలు అన్నీ బాగుంటే పెళ్లి అయిన తర్వాత కూడా చాలా మంది భార్య భర్తలు విడిపోవడం జరుగుతుంది. నక్షత్రాలను చూసుకుని పాయింట్లను చూసుకుని పెళ్లి చేసుకుంటూ ఉంటారు చాలా మంది. 36 పాయింట్లు కి 18 దాటేస్తే చాలా మంది పెళ్లిళ్లు చేసేసుకుంటూ ఉంటారు. నిజానికి ఇది సరైన పద్ధతి కాదు. వధువు జాతకం లో వరుడు జాతకం లో యోగాలని తప్పక చూడాలి. అలానే ఆకర్షణ సంబంధం ఎలా ఉంటుంది…? ఎవరికి ఎటువంటివి నచ్చుతాయి అనే విషయాలని పరిగణలోకి తీసుకోవాలి..?
Ads
పాయింట్లు చూసుకుని పెళ్లి చేసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. అలానే చాలామంది భర్త లేదా భార్య బాగా చూసుకుంటారా లేదా అనేది ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందని కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. మీకు కాబోయే జీవిత భాగస్వామితో మీరు ఎలాంటి ప్రేమని పంచుతారో అదే మీకు తిరిగి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. కేవలం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే సరిపోదు. త్వరగా భార్య భర్తలు సర్దుకోలేరు. ఇద్దరూ వేరువేరు కుటుంబాల నుండి వస్తారు.
కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అర్థం చేసుకునే గుణం తక్కువగా ఉంటుంది. ఇద్దరూ ఒక మాటకి రావడానికి సమయం పడుతుంది. అన్ని విషయాల్లోనూ త్వరగా సెట్ అయిపోలేరు. ఇటువంటి విషయాలని అర్థం చేసుకోకుండా వధువు కానీ వరుడు కానీ కుటుంబ సభ్యులకి చెబుతూ ఉంటారు ఇది కూడా భార్యాభర్తల మధ్య ఇబ్బందుల్ని కలిగిస్తుంది. ఇలా చెప్పినప్పుడు కొంత మంది తల్లిదండ్రులు అడ్జస్ట్ అవ్వాలి అని చెప్తూ ఉంటారు. ఇలా చెప్పడం నిజంగా పెద్ద తప్పు.
ఎందుకంటే ఎవరికీ కూడా ఇలా చెప్పడం నచ్చదు. కొంచెం తక్కువ అని తగ్గమని అనడం ఎవరికీ ఇష్టం ఉండదు. తల్లిదండ్రులు అలా చెప్పకుండా అర్థం చేసుకోమని పిల్లలకి చెప్పాలి. అప్పుడు పిల్లలకి అర్థం అవుతుంది. తల్లిలాగ భార్య ఆలోచించి భర్తను చూసుకుంటే భర్తకి ఏ బాధ ఉండదు అలానే తండ్రి లాగ భర్త తన భార్యను చూసుకుంటే ఆమెకి ఎటువంటి ఇబ్బంది రాదు. కాబట్టి భార్యా భర్తలు ఈ విధంగా నడుచుకుంటే వాళ్ళ జీవితం బాగుంటుంది.