Ads
ఇదివరకు కంటే పద్ధతులు బాగా మారిపోయాయి. ఇది వరకు మన పూర్వీకులు పాటించే పద్ధతులను మనం నేడు అనుసరించడం లేదు. వస్త్రధారణలో కూడా చాలా మార్పు వచ్చింది. ఇది వరకు రోజుల్లో మహిళలు జీన్ ప్యాంట్లని వేసుకునే వాళ్ళు కాదు. కానీ ఈ మధ్య చాలా మంది చీరలకి గుడ్ బై చెప్పేసి కంఫర్ట్ గా ఉంటుందని జీన్స్ చుడిదార్ వంటివి వేసుకుంటున్నారు. అయితే ఎప్పుడైనా మీకు సందేహం వచ్చిందా..?
మగ వాళ్ళకి జీన్ ప్యాంట్ల పాకెట్లు ఉన్నట్టుగా ఆడవాళ్ళ జీన్స్ పాంట్స్ కి పాకెట్లు ఎందుకు ఉండవని.. ఆ విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం.
మహిళలు ఎప్పుడూ కూడా కాస్త ఫ్లఫీగా ఉండే బట్టలని ధరిస్తూ ఉంటారు. అందంగా ఉండడానికి చూస్తూ ఉంటారు. చక్కటి డిజైన్లతో అందుకనే మహిళలు బట్టలు ఉంటాయి. 1800 ల్లో ఎక్కువ మంది మహిళలు ఎక్కడకి వెళ్లినా పర్సులని తీసుకు వెళ్లే వారు. కాస్త అందమైన డిజైన్లతో ఉండే అవుట్ ఫిట్స్ ని వేసుకునేవారు అవసరమైనవి పర్సులో పెట్టుకుని వెళుతూ ఉండేవారు. ఆ తరతవ ప్యాంట్లలోకి మహిళలు వచ్చారు. క్రమంగా ప్రతిదీ కూడా మారుతూ వచ్చింది. పురుషులలాగే మహిళలు కూడా ప్యాంట్లు వేసుకోవడం మొదలుపెట్టారు.
Ads
మొదట్లో మహిళలకి కూడా పురుషులకి ఉన్నట్లుగానే పాకెట్లు సేమ్ ఉండేవి కానీ మహిళల ఆకృతి పురుషుల ప్యాంట్లు లాంటి ప్యాంట్లు వేసుకుంటే దెబ్బతింటుంది. దీంతో మహిళల ప్యాంట్లు లో కూడా మార్పు చేశారు పాకెట్లు లేకుండా ప్యాంట్లు వచ్చాయి. పైగా మహిళలు పాకెట్లలో ఏమైనా పెట్టినా అది వారి ఆకృతిని చెడకొడుతుంది. చాలా పెద్దగా పాకెట్లో ఉండేవి కనబడుతూ ఉంటాయి చూడడానికి బాగోదు. ఆ తర్వాత కార్గో ప్యాంట్లని తయారు చేశారు ఇప్పుడు ఎక్కువగా లెగ్గిన్స్ జీన్స్ వంటి వాటిని మహిళలు వేసుకుంటున్నారు. మహిళల ప్యాంట్లకి కూడా చిన్న చిన్న పాకెట్లని పెడుతున్నారు.
ఫాల్స్ పాకెట్స్ చిన్న పాకెట్లు వంటి వాటిని మహిళలకు డిజైన్ చేస్తున్నారు అయితే కాలం మరే కొద్ది కూడా బట్టలు విషయంలో మార్పులు వస్తూ ఉంటాయి. రేపు ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పలేము. సెలబ్రిటీలు కూడా పాకెట్లతో ప్రోగ్రామ్స్ కి వస్తున్నారు రెడ్ కార్పెట్ ఈవెంట్స్ వంటి వాటికి కూడా పాకెట్ లు వున్నా బట్టలని వేసుకు వస్తున్నారు.