అత్తా కోడలు ఎందుకు గొడవ పడతారు…? దాని వెనుక సైకలాజికల్ రీజన్ ఉందా..?

Ads

చాలామంది అత్త కోడలు మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. సర్వసాధారణంగా ఏ అత్తా కోడలికి కూడా పడదు. చీటికీమాటికీ అత్తా కోడళ్ల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. అసలు ఎందుకు అత్తా కోడలు మధ్య తరచు గొడవలు వస్తూ ఉంటాయి..? దాని వెనుక కారణం ఏమిటి అనే ఇప్పుడు తెలుసుకుందాం. సినిమాల్లో సీరియల్స్ లో కూడా అత్తా కోడల మధ్య గొడవలు చూపిస్తూ ఉంటారు.

చాలా మంది యుద్దానైన ఆపొచ్చు కానీ అత్త కోడల మధ్య గొడవని ఆపలేము అని అంటూ ఉంటారు. అయితే అసలు అత్తా కోడళ్ళకి ఎందుకు పడదు…?

సిల్లీ రీజన్స్ కి కూడా ఎందుకు గొడవ పడుతూ ఉంటారు..? ఎంత మంచి అత్తయినా ఎంత మంచి కోడలు అయినా సరే గొడవ పడుతూనే ఉంటారు అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం చూసుకున్నట్లయితే సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. ఎక్కువగా ఈ సమస్య అత్తగారికే ఉంటుంది. ఆడవాళ్లు కుటుంబం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు బాధ్యతగా ఉంటారు. మగవాళ్ల కంటే కూడా ఆడవాళ్లే కుటుంబం పట్ల పాజిటివ్ గా ఉంటారు. ఎక్కువ బాధ్యత తీసుకోవడం వంటివి చేస్తారు.

ఇంట్లో మహిళ మంచి తల్లిగా బాధ్యతలు తీసుకుంటూ ఉంటుంది కానీ ఒకసారి కోడలు వచ్చిన తర్వాత మొత్తం మారిపోతుంది కొడుకు పైన చూపించే ప్రేమ కోడలు ప్రేమ కంటే తక్కువేమో అని అభద్రతాభావం అత్తకి కలుగుతుంది అలానే ఇన్నాళ్ళ నుండి ఆమె ఇంట్లో ఉండి అన్నీ చూసుకునే ఆ పదవి పోతుందేమో అని కోడలు చేతికి వెళ్లిపోతుందేమో అని అత్త బాధపడుతూ ఉంటుంది.

Ads

కొడుకుని గుప్పెట్లో పెట్టుకోవాలని కూడా అత్త చూస్తూ ఉంటుంది పెత్తనం కోడలు చేతికి వెళ్లి పోతుందేమో అని కూడా అత్త బాధ పడుతూ ఉంటుంది. అయితే ఇన్నాళ్ల నుండి నేను ఇంత బాగా చూసుకుంటున్నా ఆ ఇల్లు కోడల చేతికి వెళితే ఏం జరుగుతుంది అని భయం పడుతుంది కూడా. ఇంట్లో ఆమె చూసుకునే బాధ్యతలు అన్నీ కూడా కోడలు చేతికి వెళ్లిపోతాయేమో అన్న భయం ఆమెలో ఉంటుంది అలానే కోడలు కొడుకు సంసారాన్ని నాశనం చేస్తుందేమో అని కూడా భయపడుతుంది అత్త.

అత్తకి కొడుకు తనతో సమయం గడపడం లేదు అని కోపం కూడా ఉంటుంది ఇలా ఇవన్నీ కూడా ఆమెని బాధిస్తూ ఉంటాయి దీనితో ప్రతి విషయంలో కూడా గొడవలు పడుతూ ఉంటుంది. ఒకవేళ కనుక అత్తకి కూతురు ఉంటే ఆ కూతుర్ని పదేపదే కోడలు ముందు పొగడడం వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి కూడా అత్తా కోడలు మధ్య గొడవలు తీసుకువస్తాయి.

అలానే అత్తగారిని వాళ్ళ అత్తగారు ఎలా సాధించారో కోడల్ని కూడా అలాగే సాధించాలని ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది ఈ కారణాల వలన అత్త కోడలు మధ్య గొడవలు వస్తుంటాయి. ఈ విషయాలని ఇతరులకి అస్సలు చెప్పుకోకూడదు. చుట్టుపక్కల వాళ్ళతో గాని ఇతరులకు కానీ ఈ విషయాలు చెప్తే వాళ్లు సమస్య మరింత పెద్దది చేస్తూ ఉంటారు. గొడవ వస్తే మూడవ వ్యక్తికి చెప్పుకోకూడదు. ఏదైనా సరే డైరెక్ట్ గా మాట్లాడాలి అప్పుడే పరిష్కారం ఉంటుంది.

Previous articleదర్శకధీరుడు రాజమౌళి నటించిన సినిమా ఏమిటో తెలుసా?
Next articleగజిని సినిమాని తిరస్కరించిన 12 మంది స్టార్‌ హీరోల లిస్ట్..