Ads
రోజు రోజుకి టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ల్యాండ్ ఫోన్ నుండి మొబైల్ ఫోన్ వరకు.. డీజిల్ ట్రైన్ల నుండి ఎలక్ట్రికల్ ట్రైన్ ల వరకు ఇలా టెక్నాలజీ ద్వారా మనం అభివృద్ధి చెందుతూనే ఉన్నాము. చాలా పనులు ఎంతో సులభంగా అయిపోతున్నాయి ఇదివరకు రోజుల్లో ఎంతో కష్టపడితే కానీ పూర్తికానివి ఇప్పుడు టెక్నాలజీ ద్వారా ఈజీగా అయిపోతున్నాయి. ఎన్నో కొత్త కొత్త పరికరాలు రోజు రోజుకీ వస్తున్నాయి.
హాయిగా స్మార్ట్ ఫోన్ వలన ప్రతిదీ కూడా ఈజీ అయిపోతోంది. అయితే ఇంత ఫార్వర్డ్ గా అన్ని దేశాలు వుంటుంటే పాకిస్థాన్లో ఎందుకు ఇంకా డీజిల్ ఇంజన్స్ ని ఉపయోగిస్తున్నారు..? మరి ఇక దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. దాని వెనక కారణం చూస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు.
Ads
పాకిస్తాన్ లో ఎలక్ట్రిక్ ఇంజిన్ ని ఉపయోగించరు కనీసం ఒక్క ఎలక్ట్రిక్ ఇంజన్ కూడా పాకిస్తాన్ లో లేదు. అయితే ఎందుకు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న పాకిస్థాన్ లో ఒక్క ఎలక్ట్రిక్ ఇంజన్ వాడడం లేదు దాని వెనక కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. పాకిస్తాన్ లో ఎలక్ట్రిక్ ఇంజన్ ని వాడడం లేదు కేవలం డీజిల్ ఇంజన్స్ ని మాత్రమే ఉపయోగిస్తున్నారు. నిజానికి 1966 లో పాకిస్తాన్ లో ఎలక్ట్రిక్ ఇంజన్లని వాడడం మొదలుపెట్టారు లాహోర్ నుండి ఈ ట్రైన్ నడిచేది.
కానీ అప్పట్లో ఏం జరిగిందంటే ఈ ఎలక్ట్రిక్ ట్రైన్ లో ఉండే వైర్లతో కాపర్ ని దొంగలించడం మొదలుపెట్టారు. ఇలా కాపర్ ని దొంగలించడంతో డబ్బులు లేక అప్పటినుండి కూడా ఎలక్ట్రిక్ ఇంజిన్లని నడపడం మానేసింది పాకిస్తాన్. 2011లో ఈ సర్వీసులను పూర్తిగా ఆపేశారు. పాకిస్తాన్ లో రైళ్లు అన్నీ కూడా డీజిల్ ఇంజన్స్ మీదే నడుస్తున్నాయి. ఇలాంటి వింతైన సంఘటనలు ఎక్కువగా పాకిస్థాన్లోనే మనకి కనబడతాయి.