Ads
నేటి కాలంలో నాన్ వెజ్ లేకుండా ఎవరు భోజనం చేయడం లేదు. వెజ్ తో భోజనాలు పెడుతుంటే ముక్క లేనిదే ముద్ద దిగదే అంటూ మొఖం వేలాడేస్తున్నారు. గతంలో దేవుడి పేర్లు చెప్పి కొన్ని కొన్ని రోజులు నాన్ వెజ్ తినేవారు కాదు.
లక్ష్మివారం సాయిబాబా అని, మంగళవారం ఆంజనేయ స్వామి అని, శనివారం వెంకటేశ్వర స్వామి, శుక్రవారం అమ్మవారు, సోమవారం పరమేశ్వరుడు, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుడు, బుధవారం అయ్యప్ప స్వామి ఇలా ఎవరికి నచ్చిన దేవుళ్ళకి వాళ్ళు మొక్కుకొని నాన్ వెజ్ జోలికి వెళ్లేవారు కాదు కానీ నేడు ఆ పరిస్థితి చాలా వరకు తగ్గిపోయింది.
ఇప్పుడు అందరూ మొదటి ప్రాధాన్యత నాన్ వెజ్ కే ఇస్తున్నారు. మిగతా ఆహార పదార్థాలు కంటే నాన్ వెజ్ లో ప్రోటీన్లు ఎక్కువగానే ఉంటాయి, అలాగే ఎనర్జీ కూడా దీర్ఘకాలికంగా ఉంటుంది. కానీ ప్రత్యేకంగా శనివారం రోజు నాన్ వెజ్ తినొద్దు అని పెద్దవాళ్లు చెప్తే వెంకటేశ్వర స్వామి మీద భక్తి తో చెప్తున్నారు అనుకునే వాళ్ళం. అయితే అది కూడా నిజమే కానీ శనివారం నాన్ వెజ్ ఎందుకు తినకూడదు అనేదానికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి అది ఏంటో చూద్దాం.
Ads
ప్రతి శనివారం భూమిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో వాతావరణం దాదాపు చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీంతో మనుషుల జీర్ణక్రియలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. అందుకే శనివారం రోజు ఎలాంటి హెవీ ఫుడ్ తీసుకున్నా తొందరగా డైజెషన్ అవ్వదు. ముఖ్యంగా నాన్ వెజ్ తీసుకోవటం ఆరోగ్యానికి మరింత నష్టం అని చెప్తున్నారు సైంటిస్టులు.
అందువల్ల పెద్దవాళ్లు చెప్పినట్లు శనివారం పూట నాన్ వెజ్ జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. స్వామి కార్యం, స్వకార్యం అన్నట్లు శనివారం నాన్ వెజ్ తినకపోవడం వలన ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకుండా ఉండడమే కాకుండా అదనంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని కూడా పొందిన వారం అవుతాము. అందుకే అంటారు పెద్దలు కారణం లేకుండా ఏదీ చెప్పరు అని.