ఈ విషయంలో ఇతర హీరోలకు లేని బాధ తెలుగు హీరోలకు మాత్రమే ఎందుకు..? ఇది మాత్రం మారదా..?

Ads

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు వయసు మీద పడుతున్న కొద్దీ వారికి అనుగుణంగా తగ్గట్టుగా సినిమాలలో ఆ పాత్రలను ఎంచుకుంటూ ఉంటారు.

అయితే ఎక్కువ శాతం హీరోలు వయసు గురించి పట్టించుకోకుండా ప్రేక్షకులకు నచ్చే పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ఉంటారు. ఉదాహరణకు జైలర్ సినిమాలో రజనీకాంత్ తాత పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

కమల్ హాసన్ కూడా విక్రమ్ సినిమాలో ఆయన ఏజ్ కి తగ్గ పాత్రలోనే నటించారు. ఇలా ఈ ఇద్దరు హీరోలు వారి వయసుకు తగ్గట్టుగా పాత్రలను ఎంచుకున్నారు. అయితే ఆ హీరోలు తలచుకుంటే యంగ్ హీరోల మాదిరిగా రెడీ అవ్వడంతో పాటు మంచి మంచి సినిమాలు కూడా తీయగలరు.

కానీ రొమాంటిక్ సినిమా జోలికి వెళ్లకుండా కంటెంట్ గల సినిమాలలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ తెలుగు హీరోలు మాత్రం ఇప్పటికీ యంగ్ హీరోలుగా నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. హీరోలు తమ వయసుకు తగ్గ పాత్రలు చేస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. లేదంటే నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తారు.

leo censor review

Ads

తాజాగా తమిళ స్టార్ విజయ్ లియో సినిమాలో ఇద్దరు పిల్లలకు తండ్రిగా నటించాడు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా టైగర్ 3లో అదే చేసాడు. అయితే ఇతర సినిమా ఇండస్ట్రీలో హీరోలు వారి ఏజ్ కి తగ్గ పాత్రలో నటిస్తుంటే తెలుగు హీరోలు మాత్రం ఎందుకు ఆ విషయాన్ని గుర్తించలేకపోతున్నారు అని తెలుగు అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఇటీవలే బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య బాబు పెంచే పాత్రలో నటించారు.

కానీ కూతురు తనది కాదంటూ తండ్రికి బదులు చిచ్చా అని పిలిపించారు.దర్శకుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో అర్థం కాలేదు. నిజానికి హీరోలు యంగ్ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయడం మానేసి డీసెంట్ పాత్రల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఉదాహరణకు చిరంజీవి నే తీసుకోవచ్చు. చిరంజీవి ఆరు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ యంగ్ హీరోయిన్లతో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు. ఆయన ఏజ్ కి తగ్గ పాత్రలో నటించడం లేదు.

bhagavanth kesari review

భోళా శంకర్ సినిమా చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక బాలకృష్ణ, చిరంజీవి లు కింగ్ హీరోయిన్లతో సినిమాలు చేయడానికి పోటీ పడుతుండగా విక్టరీ వెంకటేష్ మాత్రం తన ఏజ్ కి తగ్గ పాత్రలోనే నటిస్తున్నారు. కానీ ఈ విషయాన్ని చిరంజీవి బాలకృష్ణ ఏ ఎందుకు గుర్తించలేకపోతున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏజ్ కి తగ్గ పాత్రల్లో నటిస్తే హీరోగా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నట్లున్నారు మన తెలుగు హీరోలు. అందుకే యంగ్ హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు..

Previous articleచట్నీ ఎక్కువ అయ్యింది అని భార్యతో గొడవపడ్డాడు… కానీ మరుసటి రోజు..? అసలు విషయం ఏంటంటే..?
Next article“రాముల వారి గురించి ఇలా చూపించడం ఏంటి..?” అంటూ నయనతార “అన్నపూరణి” సినిమాలోని సీన్ మీద మండిపడుతున్న నెటిజెన్లు..! అసలు విషయం ఏంటంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.