సీనియర్ హీరోయిన్ శోభన ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా.? ఇప్పుడు ఆమె వయసు ఎంతంటే.?

Ads

సీనియర్ హీరోయిన్ శోభన తన అందం అభినయంతో అందరికీ గుర్తు ఉంటుంది. స్వతహాగా మలయాళీ ముద్దుగుమ్మయిన శోభన తెలుగులో కూడా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో చాలామంది స్టార్ హీరోలు సరసన శోభన నటించింది.

1984 లో సుమన్ హీరోగా వచ్చిన శ్రీమతి కానుక చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత వెంకటేష్ తో అజేయుడు, త్రిమూర్తులు వంటి చిత్రాల్లో నటించింది. ఆ వెంటనే చిరంజీవితో చేసిన రుద్రవీణ సినిమా శోభనకి మంచి గుర్తింపు తీసుకువచ్చింది.బాలకృష్ణ తో మువ్వగోపాలుడు, నాగార్జునతో విక్రమ్ వంటి చిత్రాల్లో నటించింది. మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ వంటి అప్పటి టాప్ హీరోల సినిమాల్లో కూడా ఈమె నటించింది.

Ads

శోభన నాటిగా కాకుండా భరతనాట్యం కళాకారినిగా కూడా అందరికీ తెలుసు. ఇప్పటివరకు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి అందరి మన్ననలు పొందింది. అయితే ప్రస్తుతం శోభన వయసు 50 సంవత్సరాలు.అయితే ఇప్పటివరకు ఈమె పెళ్లి చేసుకోలేదు. అసలు శోభన ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే ఆమె ఒక కారణం చెప్పుకొచ్చింది.

యుక్త వయసులో ఉన్నప్పుడు శోభన ఒక మలయాళీ హీరోని ప్రేమించిందట, అతను హ్యాండ్ ఇవ్వడంతో ఇక ప్రేమ, పెళ్లికి పుల్ స్టాప్ పెట్టేసి సింగిల్ జీవితాన్ని కొనసాగిస్తుంది.అయితే ప్రస్తుతం శోభన ఒంటరిగా ఉండకుండా ఒక పాపను దత్తత తీసుకుని తనతో కలిసి ఉంటుంది. కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్న శోభన ఇటీవల దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన వారనే అవశ్యముందే చిత్రంలో నటించింది.

Previous articleఒకప్పటి నక్సలైట్, నేటి పద్మభూషణ్.. 180 ఫ్లాప్స్ ఉన్నా క్రేజ్ తగ్గని ఈ హీరో ఎవరో తెలుసా.?
Next articleచికెన్‌ను ట్యాప్ కింద కడుగుతున్నారా? అలా కడగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.