Ads
మొబైల్ ఫోన్లకి ఉపయోగించే సిమ్ కార్డ్ ని ఎప్పుడైనా మీరు గమనించారా..? సిమ్ కార్డు ఒక వైపు కట్ చేసి ఉంటుంది. ఎందుకు ఒక వైపు సిమ్ కార్డు ని కట్ చేస్తారు..? దానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. సాధారణంగా సిమ్ కార్డులు కి మూడు పక్కల కూడా కట్ చేసి ఉండదు.
ఒక వైపు మాత్రం చిన్నగా కట్ చేసి ఉంటుంది. గోల్డ్ కలర్ లో సిమ్ కార్డ్ లో ఒక భాగం కనబడుతుంది. ఆ భాగాన్ని చిప్ అని పిలుస్తారు.
భాగం లో పిన్స్ ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఉంచుతారు. అయితే దానిలో ఉండే పిన్స్ అన్నీ కూడా ఫోన్లో ఉండే సిమ్ స్లాట్ లోని ఒక్కొక్క పిన్ కి కూడా అటాచ్ అయి ఉండాలి. అలానే పిన్ సెల్స్ లోని పిన్స్ ఒకేలా ఉన్న వాటికి ఆనుకుని ఉండాలి. అలా అనుకోవాలి అంతే ఫోన్లో ఉండే స్లాట్ లో సిమ్ కార్డ్ ని ఒకే పొజిషన్లో ఫిక్స్ చేయాలి. ఆ ఫోన్లో ఉన్న స్లాట్ కి కట్ అయిన విధంగా స్లాట్ ఉంటుంది. కనుక సిమ్ కి కూడా అలాంటి కటింగ్ ఇస్తారు. ఇలా కటింగ్ ఉంటే ఏమవుతుంది అంటే చదువుకొని వాళ్ళు కూడా సిమ్ ని ఈజీగా ఫిక్స్ చేయగలుగుతారు. సో ఈ కారణాల వల్లనే సిమ్ కి కటింగ్ ఇస్తారు.
Ads
ఒకవేళ కనుక కటింగ్ ఇవ్వక పోతే సిమ్ కార్డ్ ని ఎలా వేయాలో కూడా మనకి తెలియదు. చదువుకున్న వాళ్ళకి కాస్త పరవాలేదు కానీ చదువుకోని వాళ్ళు సిమ్ కార్డ్ ని పెట్టలేరు. ఏటీఎం దగ్గర మిషన్ లో కార్డు ని పెట్టేటప్పుడు కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఫోన్లో మాత్రం ఈ కటింగ్ వలన మనం ఈజీగా ఫిక్స్ చేయగలుగుతాం. నానో సిమ్ కార్డులకైనా మైక్రో సిమ్ కార్డులకు అయినా కూడా ఆకారంలో మార్పు లేదు. ఇదే ఆకారంలో ఉంటుంది. కటింగ్ ఉంటుంది.