Ads
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలలో నటించి, టాప్ హీరోగా ఎదిగిన చిరంజీవి కొన్ని దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. టాలీవుడ్ కి పెద్ద దిక్కుగా, ఇండస్ట్రీలోని వారికి కష్టం వస్తే, అందరి కన్నా ముందు ఉండే వ్యక్తిగా పేరుగాంచారు.
అలాంటి మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల కాలంలో చాలా విషయాలలో కొంతమంది కావాలనే టార్గెట్ చేస్తూంటారు. ఆయన్ని మాత్రమే కాకుండా మెగా కుటుంబాన్ని కూడా టార్గెట్ చేయడం, విమర్శలు చేయడం వంటివి చేస్తుంటారు. అయితే ఆయన మాత్రం ఇలాంటివాటికి ఎప్పుడు రెస్పాండ్ అవరు. చిరునవ్వుతో అన్నిటికీ కాలమే జవాబు చెబుతుందని అంటారు.
రీసెంట్ గా దీపావళి సందర్భంగా చిరంజీవి నివాసంలో రామ్ చరణ్ పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పార్టీకి ఇండస్ట్రీలోని ప్రముఖులను ఆహ్వానించారు. సింగర్ రాజకుమారి జవాన్ మూవీ పాట పాడగా, 68 ఏళ్ల వయసులో ఉన్న మెగా స్టార్ వేసిన స్టెప్పులు, ఆయన గ్రేస్ కి అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే డ్యాన్స్ చేస్తున్నప్పుడు అనుకోకుండా రాజకుమారికి టచ్ అయ్యారు. దీనిని చిరంజీవి వ్యతిరేకులు నెగటివ్ గా ప్రచారం చేస్తూ, ట్రోల్ చేశారు.
Ads
వీడియో పూర్తిగా చూడకుండా, నిజం ఏమిటో తెలియని కొందరు మాత్రం మెగాస్టార్ ని కావాలనే టార్గెట్ చేస్తూ, శునకానందాన్ని పొందుతున్నారు. చిరంజీవి వ్యక్తిత్వం గురించి, ఆయన ప్రవర్తన గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎంతమందికి సహాయం చేసిన, మంచి పనులు చేసిన, మంచి సినిమాలు ఎన్ని చేసినా, ఏదో విధంగా చిన్న చిన్న విషయాలను పట్టుకుని ఆయన పై దుష్ప్రచారం చేస్తున్నారు.రీమేక్ చిత్రాలు చేస్తున్నారని, మెగా కుటుంబం క్రికెట్ జట్టులా ఉందని చెడుగా ప్రచారం చేస్తున్నారు. మొదలుపెట్టారు. చిరంజీవి అలాంటివాటిని పట్టించుకోడు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం చిరు పై నెగటివ్ ప్రచారం చేసేవారి మండిపడుతున్నారు. అలాంటివారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా త్రిష-మన్సూర్ అలీఖాన్ వివాదంలో త్రిషకు చిరంజీవి సపోర్ట్ చేయగా, మన్సూర్ మెగాస్టార్ పై పలు విమర్శలు చేశాడు.
Also Read: ఒకే ఒక్క కండీషన్ వల్ల తెలుగు స్టార్ హీరో సినిమా వదులుకుందా..? అదేంటంటే..?