Ads
అందరు ఎప్పుడో ఒక్కసారైనా రైలులో ప్రయాణం చేసే ఉంటారు. ప్రతిరోజూ రైలులో ప్రయాణించేవారు ఉన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేది రైలు ప్రయాణం అని చెప్పవచ్చు. రైలు ప్రయాణం ఆలస్యంగా చేరుకుంటామనే పేరు ఉన్నప్పటికీ, చాలా మంది దూర ప్రాంతాలకి రైలు జర్నీ ఎంచుకుంటారు.
Ads
రైలు పట్టాల మధ్య ‘వి’ ఆకారపు ట్రాక్‌లు కనిపిస్తుంటాయి. వీటిని రైలు ప్రయాణాలు చేసేవారిని చూసే ఉంటారు. రైల్వే పట్టాలకు పక్కనే ఉండే వీ ఆకారపు ట్రాక్‌లు ఎందుకు ఏర్పాటు చేశారో, వాటి ఉపయోగం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రపంచంలో ఇండియన్ రైల్వే వ్యవస్థ 4వ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. భారత్ రైల్వేల పొడవు మొత్తం 115000 కి.మీ.ఉంటుంది. ఇండియన్ రైల్వేలో నిత్యం సుమారు 2.5 కోట్ల మంది పాసింజర్స్ ప్రయాణం చేస్తున్నారు. కొన్ని ఏళ్లుగా ఇండియన్ రైల్వే వ్యవస్థ ఆధునికీకరణకు గురైంది. అయితే రైలు పట్టాల మధ్యలో కొన్ని స్థానాలలో వి షేపులో ఉండే ట్రాక్‌లు కనిపిస్తుంటాయి. అయితే చాలామందికి ఈ ట్రాక్ ఎందుకు అలా వీ షేపులో ఉందో తెలియదు.
నిజానికి వి షేప్ ట్రాక్‌లను రైలు పట్టాల మెయిన్ స్ట్రోక్ సపోర్ట్ గా ఉండేందుకు ఏర్పాటు చేస్తారట. రైలు నడిచే ట్రాక్ ను మెయిన్ ట్రాక్ అని అంటారు. వి – షేప్ ట్రాక్ లు వాటిని రక్షిస్తాయి. అందువల్లే ఈ ట్రాక్ లను గార్డు పట్టాలు అని పిలుస్తారు. అయితే గార్డు పట్టాలు ప్రతిచోటా ఉండవు, కొన్ని చోట్లలో మాత్రమే ఉంటాయి. వి షేప్ ట్రాక్‌లు ప్రధానంగా ఉంటాయి. ఈ ట్రాక్ లు లెవెల్ క్రాసింగ్ దగ్గర అంటే సిటీ రోడ్లు, రైల్వే ట్రాక్‌లు కలిసే దగ్గర, వంతెనల పైన వి షేప్ ట్రాక్ లు ఉంటాయి. రైలు పట్టాలు కొంచెం వీక్ ఉన్న చోట ఇవి ఉంటాయి.
Also Read: KUMARI AUNTY: హైదరాబాద్ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్… కుమారి ఆంటీ రోజుకి ఎంత సంపాదిస్తారో తెలుసా..?