భర్తకి ఎడమ వైపే భార్య ఎందుకు ఉండాలి..? దాని వెనుక ఎంతో పెద్ద కారణం వుంది..!

Ads

ఈ మధ్య కాలంలో భార్యా భర్తల మధ్య ఎక్కువ సమస్యలు కలుగుతున్నాయి. దీనితో వాళ్ల బంధాన్ని ముగించేయాలని మధ్యలోనే విడిపోతున్నారు. కానీ భార్య భర్తలు ఎప్పుడూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండడం… ఒకరి మీద ఒకరు ప్రేమను చూపించడం వంటివి చెయ్యాలి. అలానే భార్యా భర్తలు కి ఒకరంటే ఒకరు గౌరవం ఉండాలి. ఒకరి మీద ఒకరుకి నమ్మకం ఉండాలి.

అంతేకానీ చీటికి మాటికి గొడవపడటం ఇబ్బందులని మరింత పెద్దవిగా మార్చుకోవడం వంటి తప్పులు చేయకూడదు.

అయితే పెళ్లి సమయంలోనైనా పెళ్లయిన తర్వాత అయినా కొన్ని ఆచారాలని, పద్ధతుల్ని మనం పాటిస్తూ ఉంటాము. భర్తకి ఎడమ వైపు భార్య ఉండాలని అంటూ ఉంటారు. ఏదైనా పూజ చేయాలన్నా కలిసి వ్రతం వంటివి చేయాలన్నా సరే భర్త కి ఎడమ వైపు భార్యని ఉండమని అంటుంటారు. మరి దీని వెనుక కారణం ఏమిటి..? ఎందుకు భర్తకి ఎడమ వైపు మాత్రమే భార్య ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

Ads

దేవుడు ఫోటోలని చూసినా సరే భార్య భర్తకి ఎడమవైపు ఉంటుంది. ఋషులు మొదట భర్తకి ఎడమవైపు భార్య ఉండాలని చెప్పడం జరిగింది. వివాహ సమయంలో కానీ వివాహం అయిపోయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతంలో కానీ ఎడమవైపే కూర్చుంటూ ఉంటుంది భార్య. అలానే జీవితంలో ఎప్పుడైనా సరే పూజల వంటివి చేయాల్సిన పీటల మీద కూర్చోవాల్సి వచ్చినా ఎడమ వైపే భార్య ఉంటుంది. ఎందుకంటే స్త్రీ కుడి శక్తిగా.. పురుషుడి మరియు పురుషుడి ఎడమ స్త్రీ జీవించాలని ఇలా అంటారు.

అర్ధనారీశ్వర తత్వమే. కానీ చాలా మంది దీన్ని తప్పు అన్నారు. కానీ ఈ మధ్యన కొన్ని విషయాలు తెలియడం తో మళ్ళీ నమ్మడం జరిగింది. పురుషుడి ఎడమ భాగం స్త్రీ తత్వాన్ని ప్రతిబింబించేలా ఉండడం మూలానే ఇలా అంటుంటారు. ఈ విషయం మన పూర్వికులు ఎప్పుడో కనిపెట్టారు. అందుకే భర్తకి ఎడమ వైపు భార్య ఉండాలని అంటూ ఉంటారు.

Previous articleథియేటర్లలో రిలీజ్ అయిన 15 రోజులకే OTT లోకి వచ్చిన విశ్వక్ సేన్ సినిమా..! ఎందులో స్ట్రీమ్ అవుతోంది అంటే..?
Next articleఅజ్ఞాతవాసి “పవన్ కళ్యాణ్” నుండి… లైగర్ “విజయ్ దేవరకొండ” వరకు… ఇటీవలి కాలంలో ప్రేక్షకులకి చిరాకు తెప్పించిన 10 హీరో పాత్రలు..!