Ads
సాధారణంగా అమ్మాయిలు ఎలాంటి వాడిని పెళ్లి చేసుకుంటావు అని అడిగితే లక్షల్లో జీతాలు, విల్లాలలో కాపురాలు లగ్జరీ లైఫ్ ఇచ్చే భర్తని కోరుకుంటారు. అది ఒకప్పుడు కానీ ఇప్పుడు చాలామంది అమ్మాయిల అభిప్రాయం మారుతూ వస్తోంది. తనకి కావలసిన వాడు కారులోనే తిరగక్కర్లేదు టూవీలర్ మీద తిరిగినా పర్వాలేదు కానీ తనని అర్థం చేసుకునేవాడు అయి ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి లక్షణాలు వయసు పైబడిన మగవాళ్ళలో ఉన్న పెద్దగా అభ్యంతరం చెప్పడం లేదు.
ఇంకా చెప్పాలంటే అమ్మాయిలు అలాంటి వాళ్ళనే ఎక్కువగా ఇష్టపడుతున్నారని చెప్పాలి. అసలు అమ్మాయిలు అలాంటి వాళ్ళని ఇష్టపడటానికి గల కారణాలు ఏమిటి ఒకసారి చూద్దాం.
#1. నిజానికి వయసు పైబడిన వ్యక్తి తన భార్యను బాగా చూసుకుంటాడు అనే ఒక నమ్మకం ఆడవాళ్ళలో బలంగా ఏర్పడిపోయింది. ఎందుకంటే అప్పటికే అతను చాలా జీవితాన్ని అనుభవించి ఉంటాడు. జీవితం యొక్క లోతు తెలిసిన వ్యక్తి తన పిల్లలని అద్భుతంగా తయారుచేస్తాడు. తన యొక్క జ్ఞానం,నైపుణ్యం పిల్లలకి పంచడానికి తాపత్రయపడతాడు.
Ads
#2. లోకజ్ఞానం తెలియని ఒక ఆడపిల్లని వయసు పైబడిన ఒక వ్యక్తి చాలా జాగ్రత్తగా చూసుకోగలరు. ఆ మెచ్యూరిటీ కుర్ర కారులో ఎంత వెతికినా కనిపించదు.
#3. అలాగే యువతులు ఎందుకు ఎదిగిన పురుషులను ప్రేమిస్తారు అని ఒక టాపిక్ వచ్చినప్పుడు చాలామంది వయసు పైబడిన మగవాళ్ళకి పరిణితి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, ఆధ్యాత్మిక సున్నితత్వం ఉంటుంది అలాగే అటువంటి వ్యక్తులు ఎక్కువగా ప్రగల్బాలు పలకరిని చెప్తున్నారు అమ్మాయిలు.
#4. అలాగే వయోజన పురుషులు ఆడవాళ్ళని ఎలా ఆకర్షించాలో బాగా తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. అలాగే పరిణితి చెందిన పురుషులు జీవితాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. వారు తమ సహచరికి సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వటానికి ప్రయత్నిస్తారు.
#5. ఇంకొక అతి ముఖ్యమైన కారణం ఒక వయసు పైబడిన వ్యక్తి తన కన్నా బాగా చిన్నదైనా భార్య యొక్క కోపతాపాలను అర్థం చేసుకుంటాడు పైగా వాగ్వాదానికి తావివ్వడు. ఈ లక్షణాలే అమ్మాయిలని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి అని చెప్తున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్.