ఈ 4 విషయాలని ఎంత మంచి భర్య అయినా కూడా.. భర్త తో చెప్పదు..!

Ads

భార్యాభర్తల మధ్య బంధం బాగుండాలంటే భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. అలానే ఏదైనా నిర్ణయాన్ని కలిసి తీసుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి కోసం ఒకరు సమయం ఇవ్వడం, ఏది మంచి ఏది చెడు అనేది ఇద్దరు కలిసి నిర్ణయించుకోవడం ఇలాంటివి అన్నీ కూడా ప్రతి రోజు భార్య భర్తలు అనుసరిస్తూ ఉండాలి.

భార్యాభర్తల మధ్య సమస్యలు ఏమి లేకుండా ఉండడం కష్టమే. కానీ వైవాహిక జీవితంలో ఇలాంటి సమస్యలు వస్తాయని ఒకరినొకరు క్షమించడం, అర్థం చేసుకోవడం వంటివి చేయాలి. భారతీయ సనాతన వ్యవస్థలో భర్త మాటని గౌరవించి నడుచుకునే స్త్రీలు చాలామంది ఉన్నారు భార్యను గౌరవించి ఆమె అభిప్రాయాలకు విలువనిచ్చే భర్తలు చాలా తక్కువ మందే ఉంటారు.

అయితే భర్తని బాధపెట్టే విషయాలని కానీ మనశ్శాంతికి దూరం చేసే విషయాలని కానీ భార్య ఎప్పుడూ చెప్పడానికి ఇష్టపడదు. ఎక్కువ మంది భార్యలు ఈ విషయాలని భర్త దగ్గర నుండి దాస్తారు. ఇటువంటి విషయాలని వాళ్లకి చెప్పరు. మరి ఎటువంటి విషయాలని భార్య తన భర్తతో పంచుకోదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

  • భార్యలకి భర్త మీద ఎంతో ప్రేమ ఉంటుంది ఈ విషయాన్ని రుజువు చేసుకోవడానికి భర్త పై ప్రేమ ని పదే పదే ప్రకటిస్తూ ఉండే స్త్రీలు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా మంది స్త్రీలు భర్త పై ఉండే ప్రేమని చెప్పుకోరు.
  • భార్య ఏదైనా అనారోగ్య సమస్య కలిగితే భర్తకి చెప్పదు. ఓపిక తెచ్చుకుని తన పనులు తాను చేసుకుంటుంది తప్ప భర్తకి తనకి ఒంట్లో బాగోలేదు అన్న విషయాన్ని చెప్పదు.

  • ఏ విషయం గురించి అయినా భార్యలు ఆందోళన చెందుతున్నా బాధపడుతున్నా ఆ విషయాన్ని భర్తకి చెప్పరు. అటువంటి విషయాలని భర్తతో చెప్పుకోవడానికి ఇష్టపడరు. చాలామంది స్త్రీలు ఈ విషయాన్ని దాస్తూ ఉంటారు.
  • భర్తకు తెలియకుండా కొంతమంది భార్యలు రహస్యంగా డబ్బులు దాస్తారు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే భర్తకి ఇస్తారు. డబ్బులు దాస్తున్నానన్న విషయం భర్తకి చాలా మంది స్త్రీలు చెప్పరు. ఒకవేళ కనుక ఈ విషయాన్ని చెప్తే భర్త వాటిని కూడా ఖర్చు చేసేయొచ్చు కాబట్టి చాలా మంది స్త్రీలు ఈ విషయాన్ని కూడా దాస్తారు.

 

Previous articleపిల్లలు ఎట్టి పరిస్థితిలో ఫోన్ ముట్టుకోకుండా ఉండాలంటే.. ఈ టెక్నిక్ ని ఫాలో అవ్వండి..!
Next articleఇండియాలో బ్యాన్ చేసిన సినిమాలు ఇవే.. ఫుల్ లిస్ట్ ని చూసేయండి మరి..!