Ads
ప్రస్తుత సమాజంలో ప్రజలు మనుషులతో కన్నా ఫోన్ తోనే ఎక్కువగా కాలం గడుపుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఫోన్ కోసం,ఫోన్లో చేసే రీల్స్ కోసం, రీల్స్ వల్ల వచ్చే ఫాలోవర్స్ కోసం సొంత వాళ్ళని కూడా వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వటం కోసం ప్రాణాలను సైతం తెగించి రీల్స్ చేస్తున్నారు.
అబ్బాయిలు భయంకరమైన బైక్ స్టంట్స్ వేస్తుంటే అమ్మాయిలు వాళ్లు ఎక్కడ ఉన్నారు అనేది గమనించకుండా చిందులు వేస్తూ రీల్స్ చేస్తున్నారు. అది పిచ్చో, పైశాచిక ఆనందమో లేక ఇంకేం అనాలో తెలియని పరిస్థితి.
తాజాగా ఒక మహిళ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై డాన్స్ వేసింది పక్కనే ఉన్న కొడుకు కింద పడిపోయినా కూడా ఆమె పట్టించుకోలేదు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ తన బిడ్డతో కలిసి ప్లాట్ ఫామ్ పై నడుస్తూ వెళుతుంది అంతలో ఆకస్మాత్తుగా ఆమె డాన్స్ చేయడం ప్రారంభించింది.వేరొకరు వీడియో తీస్తుండగా ఆమె డాన్స్ వేసుకుంటూ ముందుకు వెళుతుంది. ఇంతలో వెనుక నడుస్తున్న ఆమెకి కొడుకు కింద పడిపోయాడు.
Ads
ఆ మహిళ కొడుకు పడిపోయాడని కూడా గ్రహించకుండా డాన్స్ చేస్తూనే ఉంది. ఈ వైరల్ వీడియో ట్విట్టర్లో ఇప్పటివరకు 19.7 వేల మందికి పైగా వీక్షించారు. అయితే ఈ వీడియోని మహిళలు విమర్శిస్తున్నారు. ఆమెను ముందు డాక్టర్ కి చూపించాలని కొందరు, కన్న పిల్లల కంటే రీల్స్ ఎక్కువ అంటూ కొందరు ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.
ఈమె అనే కాదు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న చాలా రీల్స్ మానవ సంబంధాలను మంటగలిపేలానే ఉన్నాయి. అయినప్పటికీ ఆ రీల్స్ ఎక్కువ వ్యూస్ సంపాదించి వైరల్ అవుతుండటంతో మరింత భయంకరంగా, పిచ్చిగా రీల్స్ చేస్తూ వైరల్ అవుతున్నారు ఇలాంటి వాళ్లు. ఎవరు తిట్టినా పర్వాలేదు, సంబంధీకులు ఎలా పోయినా పర్వాలేదు వైరల్ అయితే చాలు అనుకునే ఇలాంటి వాళ్ళు సమాజంలో రోజురోజుకీ పెరిగిపోతుండటం విచారకరం.
watch video :
बच्चा गिर जाए, चोटिल हो जाए, प्लेटफार्म से नीचे चला जाए रील बननी चाहिए. यहीं लड़का बड़ा होकर कहेगा – तू नारी नहीं पिशाचिनी है पिशाचिनी। पति जी तो मेरी तरह लग रहे 🙄🙄 pic.twitter.com/kOH3v3HvH8
— लंकेश (@Observer4s) January 28, 2024