Ads
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరపడంతో హిందువుల ఆకాంక్ష నెరవేరుతుంది. చాలామంది హిందువుల చిరకాల కాంక్ష ఇది. ఎందరో అయోధ్య రామ మందిరం కోసం పోరాడి అసువులు బాసారు.
అయితే జనవరి 22వ తారీఖున రామ మందిర ప్రారంభోత్సవం శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరపనున్నారు.
ఈ వేడుక చాలామందికి భావోద్వేగా భావాలను కలిగిస్తుంది. జార్ఖండ్ రాష్ట్రంలోని ధనబాద్ గ్రామానికి చెందిన 85 ఏళ్ల సరస్వతి దేవికి శ్రీరాముడు అంటే ప్రాణం. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఆమె అయోధ్యను సందర్శించారు. అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మించేంతవరకు తాను మౌనవ్రతం చేస్తానని ప్రణమం చేశారు. అప్పటినుండి ప్రతిరోజు 23 గంటలు ఎవరితో మాట్లాడకుండా గడుపుతారు. ఏదైనా కావాలంటే సైగల తో అడుగుతారు. రోజులో ఒక గంట మాత్రమే కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు.
Ads
2020 సంవత్సరంలో ప్రధాన మోడీ అయోధ్య మందిరానికి భూమి పూజ చేసిన తర్వాత ఆమె రోజులో 24 గంటలు ప్రారంభించినట్లుగా ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. జనవరి 22న జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి ఆమెకు ఆహ్వానం అందింది. ఆరోజు రామునికి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత ఆమె మౌనవ్రతం వెళతారని ఆమె కుమారుడు చెప్పారు. స్థానిక ప్రజలు ఆమెను మౌనిమాతగా పిలుస్తారు. ఈ ఒక్క మహిలే కాదు దేశంలో ఎందరో మంది రామ మందిరం నిర్మాణం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. త్వరలో ఇది కార్యరూపం దాల్చనున్న సందర్భంగా వారందరి ఆనందాలకి అవధులు లేకుండా పోయింది.