బాయ్ ఫ్రెండ్ తో ఓయో కి వెళ్ళింది…కానీ చివరికి శవమై.! అసలేమైంది.?

Ads

ఈ మధ్య కాలంలో ప్రేమ చాలా మారిపోయింది. ప్రేమికులు లవ్ పేరుతో చాటింగ్స్, కాల్స్, వీడియో కాల్స్ లో మునిగిపోతున్నారు. ప్రేమలో డేటింగ్ అంటూ రిలేషన్ కొనసాగుతున్నారు. వివాహానికి ముందు లవర్స్ ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకోవాలని ఉద్దేశంతో సెలవులు, వీకెండ్స్ లో హోటల్ రూమ్స్ కు కూడా వెళ్తున్నారు.

Ads

అమ్మాయిలు కూడా ప్రేమించినవాడి గురించి తెలుసుకోవచ్చనే ఉద్దేశంతో లవర్ పిలిచిన ప్లేస్ కు వెళ్తూ, ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు. బాగా చదువుకుని, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలు కూడా సమస్యలలో పడుతున్నారు. తాజాగా ఇలా ఒక ఐటీ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి ప్రాణాలు పోగొట్టుకుంది.
పూణేలో ఐటీ జాబ్ చేస్తున్న వందనా ద్వివేది(26) శనివారం హింజేవాడి లక్ష్మీనగర్ ప్రాంతంలోని  ఓయో హోటల్ గదిలో శవమై కనిపించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తులో ద్వివేదితో పాటు మరొక వ్యక్తి హోటల్ గదికి  వచ్చినట్లు తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ వ్యక్తి(రిషబ్ నిగమ్‌)ని పిస్టల్‌తో సహా అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి తాను చేసిన హ-త్య గురించి వెల్లడించాడు. సాయంత్రం అతన్ని పింప్రి-చించ్వాడ్ పోలీసుల క్రై-మ్ బ్రాంచ్ బృందానికి అప్పగించారు.మృతురాలు లక్నోకు చెందిన వందనా ద్వివేది, గత రెండేళ్లుగా హింజేవాడిలోని రాజీవ్ గాంధీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్‌లో ఉన్న ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నారు. ద్వివేది, నిగమ్ ఉద్యోగం కోసం పూణే వెళ్ళే ముందు లక్నోలో ఒకే ప్రాంతంలో ఉండేవారు. 2014 నుంచి ఒకరికొకరు తెలుసని, కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇటీవల, ద్వివేది తనను పట్టించుకోవడం లేదని నిగమ్ అనుమానించాడు. దాంతో అతను ఆమెను హ-త్య చేసి ఉండవచ్చు. అయితే, కస్టడీ విచారణ అనంతరం హ-త్య వెనుక అసలు ఉద్దేశ్యంపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.

Also Read: అయోధ్య రాముడు ప్రాణప్రతిష్టరోజు పుట్టిన ముస్లిం బాలుడు…ఏం పేరు పెట్టారంటే.?

 

Previous articleతండ్రి కలను నెరవేర్చని జగన్.. వైఎస్ రాజశేఖరెడ్డి వారసుడు ఎలా అవుతారు..?
Next articleఉద్యోగం లేకపోయినా భర్త మనోవర్తి చెల్లించాల్సిందే.. తీర్పునిచ్చిన అలహాబాద్ హైకోర్టు!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.