Ads
వరల్డ్‌కప్ 2023 మెగాటోర్నీలో భారత జట్టు నేడు బంగ్లాదేశ్‌తో పూణే వేదికగా తలపడనుంది. ఇప్పటివరకు ప్రపంచకప్ టోర్నీలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో భారత్ జయభేరి మోగించింది. ఇప్పుడు నాలుగవ విజయం పై టీంఇండియా కన్నేసింది.
ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లపై విజయం సాధించిన ఇండియా, అదే జోరును నేడు బంగ్లాదేశ్ పై కొనసాగించాలని అనుకుంటుంది. అయితే మాజీ క్రికెటర్లు టీంఇండియా సారధి రోహిత్ శర్మకు జాగ్రత్తలు చెప్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను సాధించాలనే పట్టుదలతో భారత జట్టు టోర్నీలో ఇప్పటివరకు విజయాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం టీంఇండియాలో ఉన్న ప్రతి క్రికెటర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భారత జట్టును ఓడించడం ఎంత పెద్ద జట్టుకైనా కష్టతరం అవుతుంది. అయినప్పటికీ ఈరోజు జరగబోయే భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ కు ముందు మాజీ క్రికెటర్లు, రోహిత్ కు జాగ్రత్తలు చెప్పారు. చిన్న జట్లతో ఆడుతున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఆడాలని సూచిస్తున్నారు.
ఎందుకంటే ప్రపంచ కప్ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ తో ఆడిన ఇంగ్లాండ్ పరాజయం పాలైంది. ఆ తరువాత నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్టు చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ విషయంలో రోహిత్ కు జాగ్రత్తలు చెప్తున్నారు. అది మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌తో టీంఇండియా ఆడిన ఆఖరి నాలుగు వన్డేల్లో మూడింటిలో భారత్ ఓటమి చవి చూసింది. ఆసియాకప్2023 లో కూడా భారత జట్టు బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. అందువల్లే మాజీ క్రికెటర్లు బంగ్లాదేశ్‌ను అంత తేలిగ్గా చూడకూడదని సూచిస్తున్నారు.
ప్రపంచ కప్ బంగ్లాదేశ్ సాధించలేకపోయినా, దానిని సాధించాలనే పట్టుదలతో ఉన్న జట్లను అడ్డుకోగలదు. బంగ్లాదేశ్ జట్టు ప్రధాన బలం షకిబుల్ హసన్, ముస్తాఫిజర్ రెహ్మన్, ముష్ఫికర్ రహీం. బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేయకుండా ఆపాలంటే, ముష్ఫికర్ రహీంని మొదట కట్టడి చేయాల్సి ఉంటుంది. షకిబ్ విషయానికి వస్తే బ్యాటింగ్, బౌలింగ్ లోను ఫామ్ లో ఉన్నాడు. ఇక ముస్తాఫిజర్ ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఉంది. అందువల్ల ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో భారత బ్యాటర్స్ అప్రమత్తంగా ఆడాల్సి ఉంటుందని అంటున్నారు.
Ads
Also Read: అంత మంచి బౌలర్ కి ఏంటి ఈ పరిస్థితి.? రోహిత్ ఇకనైనా మేలుకుంటాడా.?