Ads
ఐసీసీ ప్రపంచకప్2023 టోర్నీలో ముంబై వాంఖడే వేదికగా జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్‌ను ఓడించి, టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. కివీస్ పై 70 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత్ గెలుపులో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ షమీ కీలక పాత్రలను పోషించారు. కానీ ఇండియా గెలిచింది అతని వల్లే అంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ ప్రశంసించాడు. మరి ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ లు సెంచరీలు చేయడంతో 50 ఓవర్లలో 397 పరుగుల భారీ స్కోర్ చేసింది. 398 రన్స్ భారీ టార్గెట్ ను చేధించడానికి బరిలోకి దిగిన కివీస్ 48.5 ఓవర్లకు 327 రన్స్ చేసి, ఆలౌటైంది. డార్లీ మిచెల్ సెంచరీ చేసి, 134 పరుగులకు అవుట్ అయ్యాడు. కేన్ విలియమ్సన్ 69 చేశాడు. మిగతా ప్లేయర్స్ మహ్మద్ షమీ సూపర్ స్పెల్ కు తక్కువ స్కోర్ కే బలయ్యారు. ఈ మ్యాచ్ లో షమీ 7 వికెట్లు తీసి విజయంలో కీలకంగా మారాడు. అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
అయితే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ మాత్రం ప్రపంచ కప్ 2023లో భారత విజయానికి కారణం కెప్టెన్ రోహిత్ శర్మ అని, అతనే నిజమైన హీరో అని ప్రశంసించాడు. బుధవారం వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్ గెలుపు తర్వాత స్కై స్పోర్ట్స్‌లో మాట్లాడుతూ, హుస్సేన్ శర్మ ఇలా అన్నాడు.
“రేపటి హెడ్‌లైన్స్ విరాట్ కోహ్లీ గురించి, శ్రేయాస్ అయ్యర్ గురించి మరియు మహ్మద్ షమీ గురించి ఉంటుంది. కానీ ఈ భారత జట్టు నిజమైన హీరో, జట్టు సంస్కృతిని మార్చింది రోహిత్ శర్మ. అడిలైడ్‌లో జరిగిన టీ 20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో భారత్ ఇంగ్లండ్‌తో ఆడినప్పుడు, అక్కడ వారు తక్కువ స్కోరు చేశారు. ఆ మ్యాచ్ లో ఇంగ్లండ్ వారిని 10 వికెట్ల తేడాతో ఓడించింది. భారత్ మారాల్సిన అవసరం ఉందని అతను దినేష్ కార్తీక్ కి చెప్పాడు” అని నాజర్ హుస్సేన్ అన్నారు.
“న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ తన దూకుడును కొనసాగించడంను హుస్సేన్ ప్రశంసించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 29 బంతుల్లోనే 47 పరుగులు చేసి ఔటయ్యాడు. “ఈరోజు నిజమైన హీరో రోహిత్ అని నేను అనుకుంటున్నాను. లీగ్ స్టేజ్ వేరు మరియు నాకౌట్ స్టేజ్ వేరు. నాకౌట్‌లలో కూడా ధైర్యంగా ఆడబోతున్నామని కెప్టెన్ అందరికీ చూపించాడు, రోహిత్ తన ఆటతీరుతో స్పష్టమైన సందేశం పంపాడు.” అని హుస్సేన్ భారత కెప్టెన్ పై ప్రశంసలు కురిపించాడు.
Ads
Also Read: “షమీకి గుడి కట్టినా తప్పు లేదు..!” అంటూ… సెమీ ఫైనల్ లో ఇండియా గెలవడంపై 15 మీమ్స్..!