Ads
ప్రపంచకప్ ఫైనల్లో టీం ఇండియా ఓడిపోయినందుకు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ప్రజలు బాధపడుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే వరల్డ్ కప్ ఫైనల్ వల్ల ఒక తెలుగు సినిమాపై దారుణమైన దెబ్బ పడిందని చెప్పవచ్చు. ఒక హిట్టు సినిమాకు లాభాలు రావాల్సింది పోయి నష్టాలు వచ్చాయి. ఇంతకీ ప్రపంచకప్- ఆ తెలుగు చిత్రానికి సంబంధమేంటో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తాజాగా నటించిన చిత్రం మంగళవారం. సినిమా విడుదలకు ముందు సినిమాపై మంచి బజ్, ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానికి తోడు థియేటర్లలోకి వచ్చిన తర్వాత అద్భుతమైన టాక్ సంపాదించింది.
కానీ లాభం లేకుండా పోయింది. ఎందుకంటె టీమిండియా ఈ వరల్డ్‌కప్‌లో అత్యద్భుతమైన ఫామ్ తో ఫైనల్‌కి చేరడం.. మంగళవారం మూవీకి శాపంగా మారింది. ఆదివారం ఫైనల్ మ్యాచ్ అయినప్పటికీ శనివారం నుంచి దేశమంతా ఆ వైబ్‌లోకి వెళ్లిపోయింది. దీంతో హిట్ కొట్టిన మంగళవారం మూవీని పూర్తిగా మరిచిపోయారు. ఈ క్రమంలోనే కలెక్షన్స్‌లో ఘోరమైన డ్రాప్ కనిపించింది. తొలిరోజు బాగానే వచ్చాయి కానీ కీలకమైన వీకెండ్‌లో మాత్రం వరల్డ్‌కప్ వల్ల జనాలు థియేటర్ల ముఖమే చూడలేదు.
Ads
మనోళ్లు కప్ కొట్టకపోయేసరికి అభిమానులు ఇంకా బాధలోకి వెళ్లిపోయారు. దాన్నుంచి బయటకొచ్చి సినిమా చూస్తారా? అంటే చెప్పలేని పరిస్థితి. ఒకవేళ వరల్డ్ కప్పు లేకపోయి ఉంటే మంగళవారం సినిమా కోట్ల రూపాయల వసూలు చేసేది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికైనా క్రికెట్ ప్రియులు ఆ బాధ నుంచి కొంచెం తేరుకొని మంగళవారం సినిమాను ఆదరిస్తే తప్ప ఈ సినిమాకు ఊహించని కలెక్షన్లు రావడం కష్టం.
కాగా అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మంగళవారం. గత వారం శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం’ సినిమా తక్కువలో తక్కువ రూ.3 కోట్లు గ్రాస్ వసూళ్లు చేస్తుంది అని చిత్రబృందం భావించింది. కానీ ఫైనల్ దెబ్బకు రూ.1 కోటి కంటే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు టాక్. వీకెండ్ ఏ ఇలా ఉంటె…వీక్ డేస్ కూడా కలెక్షన్స్ రావడం కష్టమే. మరి ఎంత వసూలు చేస్తుందో చూడాలి.