45 కోట్ల బడ్జెట్ తో సినిమా తీశారు…కేవలం 293 టికెట్లు మాత్రమే అమ్ముడు పోయాయి.!

Ads

ఈ మధ్య కాలంలో విడుదల అయిన రెండు రోజుల్లోనే, థియేటర్స్ నుండి మాయమైపోయే సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి చిత్రాల విషయంలో నటీనటులు, చిత్ర యూనిట్ కొత్తవారు, అంతగా తెలియని వారు ఉంటారు.

కానీ కొన్నిసార్లు, ప్రముఖ నటీనటులు, పాపులర్ ప్రొడక్షన్ సిబ్బంది ఉన్న సినిమాలు అంచనాల మధ్య రిలీజ్ అయ్యి కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర యంగ్ హీరో మూవీ అతిపెద్ద డిజాస్టర్‌గా రికార్డ్ సృష్టించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్, హీరోయిన్ భూమి పడ్నేకర్ జంటగా నటించిన చిత్రం ‘ది లేడీ కిల్లర్’. నవంబర్ 3న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణమైన వసూళ్లను రాబడుతోంది. ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత డిజాస్టర్‌ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి అజయ్ బెహల్ దర్శకత్వం వహించగా, శైలేష్ సింగ్, సాహిల్ మీర్ చందానీ నిర్మించారు.
ఈ మూవీ ఆడియెన్స్ నుండి కనీస అంచనాలను సైతం అందుకోలేకపోయింది. తొలి షోతోనే డిజాస్టర్ టాక్ రావడంతో నెక్స్ట్ షో నుండి ఆడియెన్స్ లేక థియేటర్లు వెలవెల బోయాయి. ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసేయడంతో మొదటి 2 రోజుల్లోనే ఈ మూవీ బాక్సాఫీస్ జర్నీ ముగిసిపోయింది. 45 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో లక్ష రూపాయలు కూడా వసూల్ చేయలేకపోయింది. ది లేడీ కిల్లర్ సినిమా ఢిల్లీ, ముంబైలో అంతంత మాత్రంగానే కలెక్షన్స్ నమోదయ్యాయి. ఈ మూవీకి సంబంధించి 293 టికెట్లు సేల్ అయ్యాయి. దాంతో రూ.40, 000 వసూళ్లు కలెక్ట్ చేసింది. ఇది అతిపెద్ద బాక్సాఫీస్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. లేడీ కిల్లర్ ముంబైలో పది స్క్రీన్‌లలో, ఢిల్లీలో ఆరు స్క్రీన్‌లలో రిలీజ్ అయ్యింది. కానీ, ఈ సినిమా శాటిలైట్ ఖర్చులను కూడా కవర్ చేయలేకపోయింది. థియేట్రికల్ బిజినెస్ అంతగా కాకపోయినా, డిజిటల్ స్ట్రీమింగ్ బిజినెస్ కొంత జరిగిందని తెలుస్తోంది.

Ads

Also Read: “స్కంద” సినిమాలో… “లాజిక్” లేకుండా తీసిన 5 సీన్స్ ఇవే..!

Previous articleవరల్డ్ కప్ లో టీమ్ ఇండియాకి పొంచి ఉన్న అసలైన గండం…అది దాటి కప్పు గెలవగలరా.?
Next articleథాయిలాండ్ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్..! ఏమిటంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.