Ads
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.కోరి కొలిచిన వారి కొంగు బంగారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు.
ఆలయ పునర్నిర్మాణం జరిగిన తర్వాత యాదాద్రి ఆలయానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా పర్యాటక ప్రదేశాలకు అనుకూలంగా కూడా మార్చడంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు యాదాద్రి కి పెద్ద సంఖ్యలో వెళుతున్నారు.
Ads
ఒక్క తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి,విదేశాల నుండి కూడా భక్తులు ఎక్కువగా వస్తున్నారు. ఇక వారాంతరాల్లో అయితే ఆలయం ఖాళీ లేకుండా కిక్కిరిసిపోతుంది.ఇక యాదాద్రి ఆలయానికి భక్తుల సంఖ్య పెరగడంతో హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. గత 28 రోజుల్లో యాదాద్రికి రికార్డు స్థాయిలో ఆదాయం రావడం విశేషం.
గత నెలలో కార్తీకమాసం సందర్భంగా అలాగే ఈ సంవత్సరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ హుండీ ఆదాయం కూడా విపరీతంగా పెరిగింది. గత 28 రోజుల్లో వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో యాదాద్రి ఆలయ హుండీ ఆదాయం మూడు కోట్ల 15 లక్షల 535 రూపాయలు వచ్చినట్టుగా ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కలు చూస్తుంటే రానున్న రోజుల్లో యాదాద్రి వైభవం మరింత పెరిగే అవకాశం ఉంది