Ads
భారతీయ రైల్వే సంస్థ ప్రపంచంలోనే అతిపెద్దది. నిత్యం కోట్లాదిమంది రైలులో ప్రయాణిస్తూ ఉంటారు. అయితే హడావిడిగా ట్రైన్ ఎక్కడం,దిగడం తప్ప ట్రైన్ లో ఉండే చిన్న చిన్న విషయాలను చాలామంది గమనించరు. చాలామంది అలాంటి వాటిని పట్టించుకోరు కూడా.
అయితే ట్రైన్ ల కోచ్ ల పైన వివిధ రంగులు, వివిధ అంకెలు ఉంటాయి.అయితే అక్కడ కనిపించే కొన్ని కోడ్స్, కనిపించే గుర్తులు, చిన్న చిన్న విషయాలు మనకు తెలియకపోవచ్చు. ఈ క్రమంలో రైలు కోచ్‌లపై ఉండే పసుపు.. తెలుపు చారలు ఎందుకు ఉంటాయి.. వాటి అర్థం ఏంటో చూద్దాం..
భారతీయ రైల్వే 1853 ఏప్రిల్ 16న తన సేవలను ప్రారంభించింది. ఇక మొదటి రైలు ముంబై నుండి థానే వరకు 33 కి.మీ ప్రయాణించింది. అయితే వివిధ ప్రత్యేకతలు కలిగిన భారతీయ రైల్వేలో కోచ్‌లపై పసుపు, తెలుపు, ఆకుపచ్చ చారలు ఉండడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది.భారతీయ ప్రయాణీకుల రవాణాలో భారతీయ రైల్వేలు గొప్ప సహకారం అందించాయి. భారతీయ రైల్వే 1951లో జాతీయం చేయబడింది. భారతీయ రైల్వేలు ఆసియాలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్, ప్రపంచంలో 2వ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ కూడా..
Ads
భారతదేశంలో నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సూపర్‌ఫాస్ట్ రైళ్లు నీలం రంగులో ఉంటాయి. ఈ బ్లూ కోచ్‌ల కిటికీపై తెల్లటి గీత ఉంటే, అది అన్‌రిజర్వ్‌డ్ కోచ్ అని తెలుసుకోవాలి.రైల్వే కోచ్ లపై పసుపు గీతలు ఉంటే.. ఆ కోచ్‌లు వికలాంగుల కోసం కోసం ప్రత్యేక కంపార్ట్‌మెంట్ అని అర్థం. అదే విధంగా ఆకుపచ్చ, బూడిద రంగులో గీతలు ఉంటే అది అమ్మాయిలకు ప్రత్యేక కోచ్‌లని అర్థం.ఇది ప్రయాణికులు, రైల్వే అధికారులు సులభంగా గుర్తించేందుకు వీలుగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు.ఇవే కాకుండా రైల్వే వ్యాస్తులు ఎన్నో రకాలైన కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ ఆధారంగానే రైల్వే అధికారులు, రైల్వే నెట్వర్క్ పనిచేస్తూ ఉంటుంది.