ప్రీ ఆస్కార్స్ పార్టీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ ధర ఎంతంటే?

Ads

గత కొన్ని రోజులుగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ సాధించడం కోసం లాస్ ఏంజెల్స్‌లో ఉంటూ ప్రమోషన్స్ తో పాటుగా ఇతర ప్రోగ్రామ్స్ లోనూ పాల్గొన్నారు.

Ads

వీటి మధ్యలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చి వెళ్లారు. అయితే రాజమౌళి, కార్తికేయ మాత్రం అక్కడే ఉండి, పనులూ చూసుకున్నారు. చివరికి అందరి నిరీక్షణ తెర పడింది. తెలుగు సినీ ఇండస్ట్రీకి కలగా ఉన్న ఆస్కార్ అకాడమీ అవార్డు ‘నాటు నాటు’ సాంగ్ తో నిజం అయ్యింది.
ఈ సినిమా హీరోలు చరణ్, ఎన్టీఆర్ లు అక్కడి మీడియాతో, ఫ్యాన్స్ తో, ఆకక్డి సినీ సెలెబ్రెటీస్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో పలు టెలివిజన్ షోలలోనూ పాల్గొన్నారు. వారితో ఎంత ప్రోమోషన్ చేయించాలో అంత చేయించారు. వీరిలో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ స్టైలిష్ లుక్ లో మెరిసిపోయారు. ఇక ఆస్కార్స్ కోసం ఇద్దరు ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇద్దరూ లాస్ ఏంజెల్స్‌లో పాల్గొన్న ప్రమోషన్లలో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అందరిని ఆకర్షించారు. వీరి లుక్ చూసి అభిమానులు, ఆడియన్స్‌కి సర్‌ప్రైజ్ అయ్యారు.
ఇక ఎన్టీఆర్ ఇంగ్లీష్ మాడ్యులేషన్ అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది. హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రీ ఆస్కార్స్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి హాజరు అయిన ఎన్టీఆర్ సూట్‌లో కనిపించారు. ఆయన డ్రెస్సింగ్‌తో మాత్రమే కాక ఎన్టీఆర్ ధరించిన వాచ్ అందరిని ఆకట్టుకుంది. దీంతో తమ అభిమాన హీరో పెట్టుకున్న వాచ్ ఖరీదు గురించి ఫ్యాన్స్ ఆన్లైన్ లో తెగ వెతికారు. తీరా దాని ఖరీదు చూసి షాక్ అవుతున్నారు.
ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ పటేక్ ఫిలిప్ నాటిలస్ ట్రావెల్ టైమ్ బ్రాండ్ కి చెందినది.  ఈ వాచ్ ఖరీదు రూ. 1 కోటి 56 లక్షల 13,155. ఇక డాలర్స్ లో అయితే 190,000 డాలర్స్. ధర ఇంత ఉంటే ఆ వాచ్ లో ఉండే ఫీచర్స్, టెక్నాలజీ చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ వాచ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: హీరో జయం రవి క్యూట్ ఫ్యామిలీని చూశారా? వైరల్ గా మారిన పొటోలు..

Previous articleనాటు నాటుకు ఆస్కార్ అవార్డు రావడానికి కారణం అత‌నేనా?
Next articleపిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచాలంటే.. పాటించాల్సిన నాలుగు సూత్రాలివే..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.