Ads
తెలంగాణలో మరో వారం రోజుల్లో అసెంబ్లీ ఎలెక్షన్స్ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. ర్యాలీలు, ప్రచార సభలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నాయి.
అయితే ఈ ఎలెక్షన్స్ బరిలో యువ మహిళా నేతలు పోటీ చేస్తున్నారు. దీంతో సీనియర్ రాజకీయ నాయకులకు, యువ మహిళా నాయకుల మధ్య ఏర్పడిన పోటీ తెలంగాణ ఎలక్షన్స్ కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ ఎన్నికలలో ఎంత మంది యువ మహిళా నేతలు పోటీ చేస్తున్నారో? వారెవరో ఇప్పుడు చూద్దాం..
యశస్విని రెడ్డి:
తెలంగాణ అసెంబ్లీ ఎలెక్షన్స్ లో పోటీ చేస్తున్న యువ అభ్యర్ధులలో తక్కువ వయస్సు కలిగిన వారిలో యశస్విని రెడ్డి ఒకరు. ఆమెకు ప్రస్తుతం 26 సంవత్సరాలు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పాలకుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. 2018లో బీటెక్ పూర్తి చేసిన యశస్వినిరెడ్డికి ఎన్నారై ఝాన్నీరెడ్డి తనయుడిని పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్లారు. ఆమె అత్తగారు ఎన్నారై ఝాన్సీరెడ్డి పాలకుర్తి నుంచి పోటీ చేయాలనుకున్నప్పటికి, కేంద్ర ప్రభుత్వం పౌరసత్వం నిరాకరించడంతో ఆమెకు బదులుగా కోడలు యశస్విని రెడ్డిని పోటీకి దింపారు. ఈసారి గెలిపిస్తే పాలకుర్తిలో మార్పు చూపిస్తాంటున్నారు.
చిట్టెం పర్ణికారెడ్డి:
30 ఏళ్ల చిట్టెం పర్ణికారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున నారాయణపేట నుండి పోటీ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం మెడిసిన్‌లో పీజీ చేస్తున్నారు. ఆమె తాతయ్య చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ ఎమ్మెల్యేగా చేశారు. ఆమె తండ్రి చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి పీసీసీ మెంబర్ గా పనిచేశారు. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తమ్ముడి కూతురే పర్ణికారెడ్డి. అలాగే ఆమె మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు మేనకోడలు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మహిళా కోటాలో పర్ణికకు పోటీచేసే అవకాశమిచ్చింది.
బర్రెలక్క:
Ads
సోషల్ మీడియాలో బర్రెలక్కగా బాగా పాపులర్ అయిన శిరీష కొల్లాపూర్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ పై ప్రభత్వం పై విమర్శలు చేస్తూ, నిరుద్యోగుల తరపున పోటీ చేస్తున్నట్టుగా వెల్లడించింది. ప్రస్తుతం బర్రెలక్క పేరు ఎక్కువగా వినిపిస్తోంది. నెట్టింట్లో ట్రెండింగ్‌లో ఉన్న బర్రెలక్క చాలామంది మద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవల ఆమె పై దాడి జరగడంతో నిరుద్యోగ యువత నిరసనకు దిగారు.
దాసరి ఉష:
27 ఏళ్ల దాసరి ఉష పెద్దపల్లి నియోజకవర్గంలో నుండి బీఎస్పీ తరఫున బరిలోకి దిగుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని కనగర్తికి చెందిన ఉష, 2018లో ఖరగ్‌పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అనంతరం సామాజిక సేవ పై ఆసక్తి చూపారు. తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ప్రోత్సాహంతో ఉష పాలిటిక్స్ లో అడుగుపెట్టారు.ప్రత్యర్థుల డబ్బు పవర్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు చెప్పారు.
బడే నాగజ్యోతి:
29 ఏళ్ల బడే నాగజ్యోతి ములుగులో బీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేస్తుంది. అయితే ఆ పార్టీ అభ్యర్థులందరిలో నాగజ్యోతి పిన్న వయస్కురాలు. ఆమె 25 ఏళ్లకే ములుగు జడ్పీ ఛైర్‌పర్సన్‌గా పని చేశారు. మావోయిస్టు పార్టీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగజ్యోతి ఎమ్మెస్సీ చేసి పాలిటిక్స్ లోకి వచ్చారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క లాంటి బలమైన నేతతో నాగజ్యోతి పోటీ పడుతున్నారు.
Also Read: పాతబస్తీలో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒకేఒక్క హిందూ నేత ఎవరో తెలుసా.?