Ads
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన భార్య భారతీరెడ్డి సుపరిచితమే. వీరి వివాహ ఫోటో మరియు పెళ్లి పత్రిక నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
సీఎం వైఎస్ జగన్, భారతీరెడ్డిల వివాహం జరిగి 27 సంవత్సరలు పూర్తయింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప ఎంపీగా పనిచేస్తున్న సమయంలో ఈ వివాహం జరిగింది.
Ads
పులివెందులకు చెందిన ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి కుమార్తె భారతి. 1996లో ఆగస్టు 28 ఉదయం 10 గంటల 30 నిముషములకు వైఎస్ జగన్, భారతిల పెళ్లి ఘనంగా జరిగింది. అయితే ఇదే ముహూర్త సమయానికి వివేకానంద రెడ్డి కుమార్తె అయిన సునీత పెళ్లి కూడా జరగడం విశేషం. వీరిద్దరి పెళ్ళిళ్ళకి సంబంధించి ఒకే శుభలేఖను వేయించారు. పెళ్లి సమయానికి జగన్ వయసు 24 ఏళ్ళు.
కడప జిల్లాలో పులివెందులలో లయోలా కాలేజీ గ్రౌండ్స్ లో పెళ్లి వేడుకను గ్రాండ్ గా జరిపించారు. జగన్, భారతిలకు ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తె పేరు హర్షారెడ్డి, చిన్న కుమార్తె పేరు వర్షా రెడ్డి. ప్రస్తుతం హర్షారెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో చదవుకుంటున్నారు. చిన్న కుమార్తె అయిన వర్షా రెడ్డి ప్యారిస్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. ప్రస్తుతం భారతిరెడ్డి వారి కుటుంబానికి సంబంధించిన భారతి సిమెంట్స్ మరియు సాక్షి మీడియా గ్రూప్‌నకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే, వైఎస్ జగన్మోహనరెడ్డి 2004 ఎలెక్షన్ సమయంలో కడప జిల్లాలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొనడం ద్వారా తన రాజకీయాలలోకి అడుగుపెట్టారు. 2009 లో కడప నుండి పోటీ చేసి పార్లమెంటు మెంబర్ ఎన్నికయ్యారు. సెప్టెంబరు 2009లో తండ్రి కన్నుమూసిన తరువాత, జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీ స్థాపించి, ఓదార్పు యాత్ర చేశారు. 2019 లో అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారనే విషయం తెలిసిందే.
Also Read: జగన్ చెప్పింది కరెక్టేనా..? అసలు విషయం ఏంటంటే..?