వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమాన హీరో ఆయనేనా..? ఆ పోస్టర్ లో నిజం ఎంత..?

Ads

నట సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని దశాబ్దాల నుండి అగ్ర హీరోగా రాణిస్తున్న బాలయ్యకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అత్య‌ధిక అభిమాన సంఘాలున్న హీరో బాల‌కృష్ణ.

Ads

ఆయనను అభిమానిచే వారిలో సినీ సెల‌బ్రెటీలూ, ఆడియెన్స్ మాత్రమే కాకుండా రాజ‌కీయ నాయ‌కులు కూడా ఉన్నారు. అన్ స్టపబుల్ షోతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలయ్యకు, ఏపీ సీఎం  వై.ఎస్ జ‌గ‌న్ కూడా అభిమాని అని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పేపర్ కటింగ్ అప్పట్లో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
2000 వ సంవత్సరంలో బాలకృష్ణకు, స‌మ‌ర‌సింహారెడ్డి చిత్రబృందానికి న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ అప్ప‌టి న్యూస్ పేపర్స్ లో పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చాయి. ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ బాలయ్య నటన ప్రేక్షకులను అలరించింది.
2000 సంవత్సరానికి చెందిన పేపర్ కటింగ్ ఒకటి అప్పట్లో నెట్టింట్లో వైరల్ అయ్యింది. అయితే ఈ ప్రకటనను ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చినట్టుగా ఉంది. ఆ పేపర్ కటింగ్ లో ‘2000 నూతన సంవత్సర శుభాకాంక్షలతో వై.యస్.జగన్మోహన్ రెడ్డి, ప్రెసిడెంట్, కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం’ అని ఉంది. అందులో జగన్ ఫోటో సైతం కనిపిస్తోంది. గతంలో కూడా చాలా సార్లు వైఎస్ జగన్, బాలకృష్ణ అభిమాని అంటూ పలు వార్తలు వినిపించాయి.
ఇక ఈ ప్రకటన చూసిన నెటిజెన్లు నిజమే అనుకున్నారు. కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, కొందరు నెటిజెన్లు ఈ ఫోటో ఫేక్ అని, మార్ఫింగ్ చేశారని తేల్చారు. అయితే సీనియర్ నటుడు విజయ్ చందర్ ఏపీఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ” సీఎం జగన్ చిన్నప్పటి నుండి సినిమాలను చాలా ఇష్టపడేవారు. ఒకప్పుడు బాలకృష్ణ ఫ్యాన్ ఆయన, బాలకృష్ణగారి సినిమాలు రిలీజ్ అవుతుంటే ఆ ఊర్లలో సెలబ్రేట్ చేసేవారు” అని వెల్లడించారు.

Also Read: ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు బౌద్ధ సన్యాసి..! ఎవరంటే..?

Previous articleనితిన్ టు శ్రీముఖి.. నిజామాబాద్ జిల్లా నుండి వ‌చ్చిన 7 గురు ప్రముఖులు వీరే..!
Next articleYATRA-2 REVIEW : “వైయస్ జగన్మోహన్ రెడ్డి” బయోపిక్ గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.