బుల్లితెర నుండి సినీ ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన 5 గురు హీరోయిన్లు..

Ads

బుల్లితెర పై విజయం సాధించిన హీరోయిన్లు వెండితెర పై తమ కెరీర్ ను ప్రారంభించి విజయం సాధించాలంటే ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ఇక సీరియల్ హీరోయిన్స్ కి సినిమాలలో ఛాన్స్ ఇవ్వడానికి చాలా మంది దర్శకనిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించరు.

Ads

అయితే సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన హీరోయిన్స్ సినిమాలలో కూడా తమ సత్తా చాటుటున్నారు.  ప్రతిభ ఉంటే లేట్ అయిన సినీ ఇండస్ట్రీలో రాణించడం సాధ్యమేనని ఈ హీరోయిన్స్ నిరూపిస్తున్నారు. ఇక వీరిలో కొంతమంది హీరోయిన్స్ పెళ్లి అయిన తరువాత కూడా సక్సెస్ ఫుల్ గా కెరీర్ లో రాణిస్తున్నారు. ఈ హీరోయిన్స్ కి స్టార్ హీరోల పక్కన కూడా ఆఫర్లు వస్తుండటం విశేషం. ఇక వీరి రెమ్యూనరేషన్స్ కూడా భారీగానే ఉంటున్నాయి. అలా బుల్లితెర నుండి వెండితెరకి వచ్చిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1.హన్సిక: 
హీరోయిన్ హన్సిక  తన కెరీర్ ను బుల్లితెర పై ప్రారంభించింది. తన ప్రతిభతో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల పక్కకన నటించి, ఎన్నో హిట్ సినిమాలు చేసింది. ఇటీవలే ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంది.
2.మృణాల్ ఠాకూర్:
సీతారామంతో విజయంతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన మృణాల్ ఠాకూర్ కూడా బుల్లితెర నుండి  సినీ ఇండస్ట్రీకి వచ్చింది. కుంకుమ భాగ్య అనే సీరియల్ లో నటించింది. ఆ తరువాత బాలీవుడ్ చిత్రాలలో హీరోయిన్ గా దూసుకెళ్తోంది.
3.ప్రియా భవానీ శంకర్: 
హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ తమిళంలో న్యూస్‌రీడర్‌ గా కెరీర్ ను మొదలుపెట్టారు. 2017లో మేయా దమాన్‌ అనే కోలీవుడ్ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
4.మౌనీ రాయ్: 
మౌనీ రాయ్ మొదట టివి నటి, మోడల్. ఆమె మహదేవ్, నాగిన్ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రాణిస్తోంది.
5.వాణి భోజన్:
వాణి బోజన్ మొదట టెలివిజన్ నటి, ఆమె ఉత్తమ అవార్డును కూడా అందుకుంది. వాణి బోజన్ తెలుగులో 2019లో వచ్చిన  మీకు మాత్రమే చెప్తా అనే సినిమాతో పరిచయం అయ్యింది.
Also Read: మంచు మనోజ్ పెళ్లి ఆ స్టార్ హీరోయిన్ లాగే చేసుకున్నాడా?

Previous articleఇప్పుడు ఎక్కడ చూసినా ఈ హీరో పేరే వినిపిస్తోంది..! ఇతను ఎవరో తెలుసా..?
Next articleEAGLE REVIEW : “రవితేజ” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.