మంచు మనోజ్ పెళ్లి ఆ స్టార్ హీరోయిన్ లాగే చేసుకున్నాడా?

Ads

మంచు మనోజ్ పెళ్లి విషయంలో ఆ హీరోయిన్ ఫాలో అయ్యాడు అనే వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే మంచు మనోజ్ ఫాలో అయిన ఆ హీరోయిన్ ఎవరో? ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు చూదాం..

తాజాగా మంచు మనోజ్ వివాహం మార్చ్ 3న మౌనిక రెడ్డితో జరిగింది. వీరి పెళ్లికి మంచు లక్ష్మి అంతా తానే అయ్యి, దగ్గరుండి తన ఇంట్లోనే ఈ పెళ్లిని చేసింది. వీరి వివాహం అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగినట్లు సమాచారం. మనోజ్, మౌనిక జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు  వెల్లువెత్తుతున్నాయి.
గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న మనోజ్, మౌనికల పెళ్లి ఫిలిం నగర్ లో ఉన్న మంచు లక్ష్మి ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ క్రమంలో మనోజ్, మౌనికల పాత ఫోటో ఒకటి ప్రస్తుతం సామాజిక మధ్యమాలలో  వైరల్ గా మారింది. వీరిద్దరికి ఇది రెండవ వివాహం. మొదటి పెళ్లి జరిగి, విడాకులు తీసుకున్న అనంతరం మనోజ్, మౌనికలు ప్రేమలో పడ్డారని సమాచారం.ఈ క్రమంలో భూమా మౌనిక రెడ్డి ఫస్ట్ పెళ్లికి మంచు మనోజ్ గెస్ట్ గా వెళ్లారు. ఈ ఫోటో వైరల్ అవడంతో ఇది హాట్ టాపిక్ అయ్యింది. దీంతో మనోజ్, మౌనికలకు విషెష్ తో పాటుగా వారి పై కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా మనోజ్ తన రెండవ వివాహ విషయంలో ఈ మధ్యే వివాహం చేసుకున్న ఒక హీరోయిన్ ని ఫాలో అయ్యాడని కూడా కామెంట్స్ చేస్తున్నారు.
అయితే మనోజ్ ఫాలో అయ్యాడని అంటున్న హీరోయిన్ హన్సిక. ఆమె సోహైల్ ఖాతూరియాని వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. గతేడాది హన్సిక వివాహం గ్రాండ్ గా జరిగింది. ఇంతకి హన్సికను, మనోజ్ ఏ రకంగా ఫాలో అయ్యాడంటే. హన్సిక 2016లో సోహైల్ మొదటి వివాహానికి గెస్ట్ గా హాజరు అయ్యింది. ఆ వధువు హన్సిక బెస్ట్ ఫ్రెండ్. కొన్నాళ్ళకు సోహైల్ ఫస్ట్ భార్యతో విడిపోయిన తరువాత హన్సిక అతడిని ప్రేమించి, వివాహం చేసుకుంది.అలాగే మంచు మనోజ్ కూడా 2015లో భూమా మౌనిక వివాహనికి గెస్ట్ గా హాజరు అయ్యాడు. ఆమె తన మొదటి భర్తతో విడపోయిన తరువాత ఆమెను  ప్రేమించి, తాజాగా వివాహం చేసుకున్నాడు. ఇద్దరి పెళ్లి ఒకే రకంగా ఉండడంతో మంచు మనోజ్ హన్సికని ఫాలో అయ్యాడని అంటున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి విషయం వైరల్ అవుతోంది.
Also Read: ఈ 4గురు దర్శకుల కుమార్తెలు ఏం చేస్తున్నారో తెలుసా?

Ads

Previous articleకట్టప్ప అలియాస్ సత్యరాజ్ కుమార్తె ఎలా ఉందో తెలుసా?
Next articleహనుమకొండ హాస్పటల్ లో ఠాగూర్ సినిమా హాస్పిటల్ సీన్ రిపీట్.. రూ.16 లక్షల బిల్..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.