Ads
సిని పరిశ్రమలో ఏ హీరో అయినా స్టార్ డమ్ ని పొందడం అనేది మామూలు విషయం కాదు. ఎవరికి అయినా గుర్తింపు ఊరికే రాదు. ఒక స్టార్ గా మారడం వెనుక ఎన్నో ఛీత్కారాలు, అవమానాలు, కష్టాలు ఉంటాయి.
Ads
వాటన్నిటిని తట్టుకొని, అప్పటి ఆడియెన్స్ అభిరుచికి తగిన కథలను ఎంచుకుంటూ, వాటికి తగ్గట్టుగా మార్పు చెందినపుడే హీరోగా నిలబడగలుగుతారు. అలా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ నుండి మెగాస్టార్ చిరంజీవి వరకు అవమానాలు ఎదుర్కొన్నవారు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1.సీనియర్ ఎన్టీఆర్:
ఎన్టీఆర్ కు అంత గొప్ప పేరు సులభంగా రాలేదు. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో టిఫిన్ కూడా సరిగ్గా దొరికేది కాదంట. నిర్మాతలను టిఫిన్ పెట్టించమని అడిగితే ఇంకా ఎంత తింటావని అవమానించివారట. నలుగురు ఐదుగురు ఒక గదిలో ఉంటూ, రేషన్ ఫుడ్ తిని ఎన్నో కష్టాలను తట్టుకుని ఎన్టీఆర్ తెలుగు పరిశ్రమలోనే తిరుగులేని స్టార్ గా ఎదిగారు.
2. అక్కినేని నాగేశ్వరరావు:
తెలుగు సిని పరిశ్రమకి అప్పట్లో ఎన్టీఆర్, నాగేశ్వరరావు లు రెండు కళ్ళుగా చెప్పుకునేవారు. అలాంటి నాగేశ్వరరావు రైతు ఫ్యామిలిలో పుట్టి, సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఒకసారి మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు అసిస్టెంట్ i will complete u అని పొరపాటుగా మాట్లాడినందుకు అవమానించారని నాగేశ్వరరావు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.3,శోభన్ బాబు:
శోభన్ బాబు చెన్నైలో పదేళ్లపాటు అనేక కష్టాలు పడ్డాడు. ఆయన భార్య ముగ్గురు పిల్లలతో ఒకే రూమ్ లో అద్దెకు ఉండేవారట. హీరోగా నిలదొక్కుకోవడానికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ, చాలా మంది దగ్గర అవమానాలకి గురయ్యాడు.
4.రజనీకాంత్:
సూపర్ స్టార్ రజనీకాంత్ కండక్టర్ ఉద్యోగం మానేసి సిని పరిశ్రమలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న క్రమంలో, అవమానాలు తప్ప అవకాశం దొరక్కపోవడంతో ఒక దశలో ప్రాణం తీసుకోవాలని అనుకున్నాడంట.
5. కమలహాసన్ :
కమల్ హాసన్ కూడా కష్టాలకు అతీతుడు కాదు. కమల్ కు నటన రాదని అవమానించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు.
6. చిరంజీవి:
చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలో అడుగు పెట్టారు. ఆయన మెగాస్టార్ గా ఎదగడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయనకు నటన రాదని ఎంతోమంది అవమానించారంట. అవన్నీ తట్టుకుని తన టాలెంట్ తో తెలుగు పరిశ్రమలోనే టాప్ హీరోగా ఎదిగారు.
7.రామకృష్ణ:
అలనాటి తెలుగు హీరో రామకృష్ణ ఒకవైపు సినిమాలలో నటించడానికి అవకాశాల కోసం తిరుగుతూ, ఇంకో వైపు సినిమాల్లో నటించే హీరోలకు బట్టలు కుట్టేవాడంట. రామకృష్ణ ఆ తర్వాత హీరోగా మారి, అప్పటి హీరోయిన్ గీతాంజలి వివాహం చేసుకున్నాడు.
Also Read: మనోజ్ టు అభిరామ్.. పెద్దవాళ్ళ సపోర్ట్ అందని 10 మంది వారసులు లిస్ట్..