మనోజ్ టు అభిరామ్.. పెద్దవాళ్ళ సపోర్ట్ అందని 10 మంది వారసులు లిస్ట్..

Ads

సినీ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే సులభంగా ఎంట్రీ కావచ్చు. అయితే బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే స్టార్స్ అయిపోతారనేది అవాస్తవం. ఇటీవల నిర్మాత బన్నీ వాసు ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి, రవితేజ, అల్లు అర్జున్, నాని లాంటి హీరోలు స్టార్స్ అయ్యారంటే అదృష్టం, హార్డ్ వర్క్ మాత్రమే కాకుండా వారిలో ఉన్న  తపనే కారణమే ఆని చెప్పారు. ఇది వాస్తవం అని చెప్పవచ్చు.

అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ లో తపన ఉండడం వల్లే కొంత పుష్ చేయగలిగారు. కానీ అల్లు అరవింద్ శిరీష్ ను స్టార్ ను చేయలేకపోతున్నారు. ఒక్క అల్లు అరవింద్ మాత్రమే కాకుండా ఎంతోమంది  స్టార్స్ కూడా తమ వారసుల కెరీర్ ను పట్టించుకోలేదు. మరి ఆ వారసులు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1.మంచు మనోజ్ :
మోహన్ బాబు రెండవ కొడుకు మనోజ్ టాలెంటెడ్ మరియు మంచి అభిరుచి ఉన్న హీరో. అయితే పెద్దబ్బాయి విష్ణు కెరీర్ పట్టించుకున్నట్టుగా మోహన్ బాబు మనోజ్ కెరీర్ ని పట్టించుకోలేదు. 2.సుశాంత్ :
అక్కినేని నాగేశ్వర రావు మనవడు మరియు నాగార్జున మేనల్లుడు సుశాంత్. ఎప్పుడో ఒక సినిమా చేస్తున్నాడు. నాగార్జున తన కొడుకుల పై మాత్రమే ఫోకస్ పెడుతున్నాడు. సుశాంత్ పైన పెట్టడం లేదు.
3.సుధీర్ బాబు :
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు మరియు మేనల్లుడు సుధీర్ బాబు. మహేష్ బాబుకు బావ. ఆయన అనుకుంటే పెద్ద దర్శకులతో సుధీర్ సినిమాలు చేయించొచ్చు. కానీ మహేష్ అలా చేయలేదు. 4.అల్లు శిరీష్ :
అల్లు శిరీష్ సినిమాలు రెండు, మూడు విజయాలు అందుకున్నాయి. కానీ స్టార్ ని చేసే ప్రయత్నం అరవింద్ చేయడం లేదు.
5. సుస్మిత కొణిదెల :
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ‘గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ అనే బ్యానర్ మొదలు పెట్టి  సేనాపతి, శ్రీదేవి శోభన్ బాబు అనే చిత్రాలను నిర్మించింది. కానీ వీటిని చిరంజీవి కానీ, మెగా ఫ్యామిలీ ప్రమోట్ చేయలేదు. 

Ads

6.నందమూరి చైతన్య కృష్ణ :
గతంలో ‘ధమ్’ అనే చిత్రంలో నటించాడు. నందమూరి ఫ్యామిలీ ఇతన్ని పట్టించుకోవడం లేదు.
7. హన్షిత రెడ్డి :
దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి ‘తన తండ్రి పేరుతో ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ అనే సంస్థని స్థాపించి, ‘బలగం’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీకి దిల్ రాజు చేసిన ప్రమోషన్స్ ఆర్డినరీగా ఉన్నాయి.
8. సాయి గణేష్ :
నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద అబ్బాయి శ్రీనివాస్ కెరీర్ పై శ్రద్ధ పెట్టినట్లుగా రెండవ కొడుకు గణేష్ పై పెట్టడం లేదు. ‘స్వాతి ముత్యం’ విడుదల అయ్యి మంచి టాక్ వచ్చినా ఆడియెన్స్ పట్టించుకోలేదు..
9. పవన్ తేజ్ కొణిదెల :
పవన్ తేజ్ మెగా ఫ్యామిలీకి చెందినవాడే. హీరోగా ఓ మూవీ చేశాడు. అయితే దాన్ని మెగా ఫ్యామిలీ పట్టించుకోలేదు.
10.అభిరాం :
నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు అభిరాం హీరోగా  తేజ దర్శకత్వంలో ‘అహింస’ అనే సినిమాలో నటించాడు. ఈ మూవీ చాలా రోజుల క్రితమే పూర్తి అయినప్పటికీ ఇంకా విడుదలకి నోచుకోలేదు. సురేష్ బాబు కూడా దాని కోసం ప్రయత్నించడం లేదు.
Also Read: కట్టప్ప అలియాస్ సత్యరాజ్ కుమార్తె ఎలా ఉందో తెలుసా?

 

 

Previous articleహనుమకొండ హాస్పటల్ లో ఠాగూర్ సినిమా హాస్పిటల్ సీన్ రిపీట్.. రూ.16 లక్షల బిల్..!
Next articleవిపరీతమైన డిప్రెషన్, గుండె జబ్బులకు కారణం కరోనా.. రీసెర్చ్ లో విస్తుపోయే నిజాలు..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.