Ads
ఆలయానికి వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కాసేపు ఆలయంలో కూర్చుని వస్తే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అందుకని చాలా మంది గుడికి వెళుతూ ఉంటారు. గుడికి వెళ్లి భగవంతుడికి కోరికల్ని చెప్తారు మంచి జరగాలని ఏదైనా ముఖ్యమైన పని ఉంటే అది అయిపోవాలని భగవంతుడిని కోరుకుంటుంటారు.
అయితే గుడికి వెళ్లి కాసేపు కూర్చొని వస్తే చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి అంతా కూడా తొలగిపోతుంది గుండెలో భారం అంతా కూడా దూరం అవుతుంది. ఇదంతా ఇలా ఉంటే గుడి నుండి వచ్చిన తర్వాత కాళ్లు కడుక్కోకూడదని స్నానం చేయకూడదని పెద్దలు అంటూ ఉంటారు. మీ ఇంట్లో కూడా చెప్తూ ఉంటారా కాళ్లు కడుక్కోకూడదు గుడి నుండి వచ్చావు కదా అని..
ఎందుకు మరి పెద్దలు ఇలా చెబుతూ ఉంటారు దాని వెనక కారణమేంటి అనేది చూద్దాం.. శాస్త్రాలు, పురాణాలు, మత విశ్వాసాల ప్రకారం గుడి నుండి వచ్చిన తర్వాత కాళ్లు చేతులు కడుక్కోకూడదు. అలానే స్నానం కూడా చేయకూడదు ఎందుకంటే మనం దేవాలయాలకి వెళ్ళినప్పుడు ఎంతో ప్రశాంతంగా మనకి ఉంటుంది.
Ads
ఆధ్యాత్మిక కోణంలో చూస్తే గుడికి వెళ్ళేది భగవంతుడి ఆశీస్సులు కోసం భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలని వెళ్తాము. అక్కడనుండి భగవంతుడు ఆశీర్వాదాలు మనం తెచ్చుకుంటూ ఉంటాము. వేదాలు ప్రకారం గుడి లేదా పవిత్ర ప్రదేశాల నుండి వచ్చాక కాళ్లు కడుక్కోకూడదు. అలానే ముఖం కడుక్కోకూడదు స్నానం కూడా చేయకూడదు. ఒకవేళ కనుక అలా చేస్తే అదృష్టాన్ని ఆశీర్వదాలను కడిగేసుకున్నట్లు.
పైగా మనం గుడి నుండి తెచ్చుకున్న పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది గుడి నుండి వచ్చిన తర్వాత కాళ్లు మురికిగా ఉంటే కడుక్కోవచ్చు తప్పులేదు. కానీ అవసరం లేకుండా కడుక్కోవడం మంచిది కాదు. నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది పాజిటివ్ ఎనర్జీ పోతుంది గుడి నుండి తెచ్చుకున్న వైబ్రేషన్స్ అన్ని పోతాయి. పైగా సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు స్నానం చేసి వెళ్తాము మళ్ళీ వచ్చిన తర్వాత చేయాల్సిన పని కూడా ఉండదు. శని దేవుడు ఆలయం నుండి వచ్చిన తర్వాత మాత్రం కాళ్లు చేతులు కడుక్కోవాలని అంటారు అలా చేస్తే శని తొలగిపోతుందని అంటారు.