ఇంగ్లీష్ లో మాట్లాడి.. విపరీతమైన ట్రోల్స్ కి గురైన సెలెబ్రెటీలు వీళ్ళే..!

Ads

హీరో హీరోయిన్ల మీద సినిమాలు మీద ట్రోల్స్ రావడం మనం చూస్తూనే ఉంటాం. ఏదైనా కాస్త వింతగా వున్నా కొత్తగా వున్నా ట్రోల్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు. ఈ స్టార్ లని కూడా విపరీతంగా ట్రోల్స్ చేశారు. అయితే వీళ్ళని ట్రోల్స్ చేసింది ఎందుకంటే ఇంగ్లీషులో మాట్లాడినందుకు. ఈ స్టార్లు మీద ఇంగ్లీషులో మాట్లాడినందుకు ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి. మరి వాళ్ళ గురించి ఇప్పుడు చూద్దాం..

ఇది వరకు కేవలం ఒక భాషలో సినిమాలు చేయడం లేదంటే పలు భాషలో సినిమాలు చేయడం వంటివి జరిగేవి. అయితే ఇప్పుడు ఏకంగా గ్లోబల్ లెవెల్ లో సినిమాలని తీస్తున్నారు. దాంతో మన తెలుగు స్టార్ హీరోలు హీరోయిన్లు గ్లోబల్ స్టార్లు కింద మారిపోతున్నారు. అయితే మన స్టార్ హీరోలు హీరోయిన్లు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ యాక్సెంట్ ని అనుకరించి విపరీతమైన ట్రోల్స్ కి గురయ్యారు. మరి వాళ్ళ జాబితా ఇప్పుడు చూద్దాం..

ప్రియాంక చోప్రా:

ప్రియాంక చోప్రా గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఆమె వరసగా హాలీవుడ్ ప్రాజెక్టులని చేస్తోంది. పలు ఇంటర్వ్యూలు ఆమె ఇస్తున్న క్రమంలో ఆమె యాక్సెంట్ మీద విమర్శలు వచ్చాయి. బాగా ట్రోల్స్ ఆమె పై వచ్చాయి.

ఐశ్వర్య రాయ్:

ఈ బ్యూటీ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు ఈమె అందరికీ సుపరిచితమే. కేన్స్ రెడ్ కార్పెట్ పై ప్రెస్ తో ఈమె ఇంటర్రాక్ట్ అయినప్పుడు ఆమె యాక్సెంట్ ని ఫేక్ చేశారని విమర్శలు ఆమెపై వచ్చాయి.

Ads

రామ్ చరణ్ తేజ్:

రామ్ చరణ్ తేజ్ మీద కూడా విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం చరణ్ విదేశాలకు వెళ్ళాడు. అప్పుడు మీడియాలకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అతని యాక్సెంట్ పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.

ఎన్టీఆర్:

ఎన్టీఆర్ కి కూడా ఇదే జరిగింది ఎన్టీఆర్ పై కూడా విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సమయంలో అతని యాక్సెంట్ ఫేక్ అని.. ఫేక్ యాక్సెంట్ పై స్పీచ్ ఇచ్చారని రోల్స్ చేశారు.

సమంత:

ఈ బ్యూటీ మీద కూడా ట్రోల్స్ వచ్చాయి. అమెరికన్ టీవీ సిరీస్ ప్రీమియర్ షో కోసం ఈమె లండన్ వెళ్లారు. అప్పుడు షో చూసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అప్పుడు ఆమె ఇంగ్లీష్
యాక్సెంట్ పై ట్రోల్స్ వచ్చాయి.

కరీనా కపూర్:

కరీనా కపూర్ కూడా ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. రెడ్ సి ఫిలిం ఫెస్టివల్ కి కరీనా కపూర్ వెళ్ళినప్పుడు తన యాక్సెంట్ ని ఫేక్ చేశారు అని రోల్స్ వచ్చాయి.

అనిల్ కపూర్:

అనిల్ కపూర్ స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీ రిలీజ్ టైం లో మాట్లాడినప్పుడు అతనిపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. విమర్శలను ఎదుర్కొన్నారు అనిల్ కపూర్. ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఇలా సెలబ్రిటీలు ట్రోల్స్ కి గురయ్యారు.

Previous articleగోపీచంద్ ఎందుకు పిల్లల విషయంలో ఇంత స్ట్రిక్ట్ గా ఉంటాడు..?
Next articleగుడి నుంచి ఇంటికి వచ్చాక కాళ్ళు ఎందుకు కడుక్కోకూడదు..? కారణం ఏమిటి..?