Ads
ఎన్టీ రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తెలుగు సినిమాకి, తెలుగు జాతికి చేసినటు వంటి సేవలను ఎప్పటికీ మరిచిపోలేరు. సాధారణ ఫ్యామిలిలో జన్మించిన ఎన్టీఆర్, కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ సినీ పరిశ్రమలోనే నటసార్వబౌమునిగా ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారు.
రాముడైనా, కృష్ణుడైనా ఆయనే అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మాస్ చిత్రాలు చేసినా, క్లాస్ చిత్రాలు చేసినా కూడా ఆ చిత్రాలు విజయాలను సొంతం చేసుకున్నాయి. అంతేకాకుండా ఎన్టీఆర్ నటించిన చాలా చిత్రాలు సంవత్సరం పాటు ఆడిన రోజులు ఉన్నాయి.
ఆయన ప్రజల శ్రేయస్సు కోరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, సంచలనం సృష్టించారు. ఆయన తెలుగు దేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా ఆయన గురించి చెప్పుకు వెళితే ఎన్నో వున్నాయి. ఈ నెల 28తో ఆయన శత జయంతిని జరిపిన విషయం తెలిసిందే.
Ads
కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్‌తో వున్నా అనుబంధాన్ని ఈ సందర్భంగా ఎంతో మంది పంచుకున్నారు. ఆయనతో ఆమెకి వున్నా అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ విజయశాంతి ఇలా ట్వీట్ చేసారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాకి ఎన్టీఆర్ గారు ఏవీఎం స్టూడియోలో డబ్బింగ్ చెప్తున్నారు. 1990లో నేను చిరంజీవిగారితో అదే స్టూడియోలో సినిమా చేస్తున్నాను. అక్కడ కలిసాను.
అక్కడ వెల్తురు సరిగ్గా లేదని ఆయన గమనించలేదు. నేను బాధపడ్డాను. ఈ విషయం ఆయనకి తెలిసింది. తర్వాతి రోజు ఉదయం 6 గంటలకే మద్రాసులో మా ఇంటికొచ్చారు. కానీ ఆ ఉదయం ప్లయిట్‌కి హైదరాబాదులో షూటింగ్‌కి వెళ్లా. అమ్మాయిని మేము చూసుకోలేదు. పొరపాటు జరిగింది అని ఆయన విజయ శాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ చెప్పేసి వెళ్లారట.
ఆ విషయమే విజయశాంతి చెప్పారు. ఈ సంఘటన జరిగి ఎన్ని సంవత్సరాలైనా ఎప్పటికీ మరిచిపోలేను అని విజయశాంతి అన్నారు. హైదరాబాదులో ఉన్న ఫోన్ నెంబర్ తెలుసుకుని నాకు ఫోన్ చేసి జరిగింది పొరపాటు మాత్రమే అమ్మా, ఐయామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని ఎన్టీఆర్ చెప్పారట.