హీరోగా మారిన ‘అతడు’ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్..

Ads

సినిమాలలో బాల నటులుగా చేసినవారు పెద్దయ్యాక హీరోలుగా ఇండస్ట్రీలో మారినవారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఉన్న కొందరు బాలనటులుగా చేసినవారే. మహేష్ బాబు నటించిన ‘అతడు’ సినిమాతో బాల నటుడిగా పరిచయం అయిన ‘దీపక్ సరోజ్’ ప్రస్తుతం హీరోగా నటిస్తోన్న ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ టైటిల్, ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి.

అతడు సినిమాలో బ్రహ్మనందం కొడుకు క్యారెక్టర్ లో నటించి, మెప్పించిన దీపక్ ఆ సినిమా తరువాత సుమారు ఇరవై చిత్రాలలో బాల నటుడిగా నటించాడు. ఆ బుడ్డోడు ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యాడు. నూనుగు మీసాలతో హీరోల కనిపిస్తున్న ఈ కుర్రాడు ప్రస్తుతం హీరోగా మారేందుకు ప్రయత్నిస్తూ బిజీగా ఉన్నాడు. మిణుగురులు అనే సినిమాలో ఒక ముఖ్యమయిన క్యారెక్టర్ లో మెప్పించాడు. ఆ చిత్రానికి నేషనల్ అవార్డు రావడంతో దీపక్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
మిణుగురులు మూవీ విడుదలై ఏడు సంవత్సరాలు పూర్తయింది. దీపక్ ‘బిగ్ బాస్ -5’ లో కంటెస్టెంట్ గా వస్తున్నట్టుగా ఆ సమయంలో ఎక్కువగా ప్రచారం జరిగింది. అయితే ఫైనల్ లిస్ట్ కు వచ్చే సరికి అందులో దీపక్ పేరు లేదు. ఇప్పటికే దీపక్ సరోజ్ ఒక గుర్తింపు క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ముందున్న టార్గెట్ స్టార్ హీరోగా అవడమే.

Ads

దీపక్ అందుకు తగిననట్టుగా తన బాడీని మలుచు కుంటున్నాడు. మంచి ఫిజిక్ ఉన్న దీపక్ సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. దీపక్ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అలాగే దీపక్ బ్రహ్మనందంతో దిగిన ఫోటోలు కూడా నెట్టింట షికారు చేస్తున్నాయి.దీపక్ కథానాయకుడిగా చేస్తున్న సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాను యశస్వి తెరకెక్కిస్తున్నాడు. నిర్మాత అల్లు అరవింద్‌, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ సినిమా టైటిల్‌ ను, ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ పేరు ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని యూత్ ను టార్గెట్ చేసుకొని రూపొందుతున్నట్టుగా సమాచారం. విడుదలైన పోస్టర్‌లో దీపక్‌ పొడవైన జుట్టు, 2 సిగరెట్లను కాలుస్తూ, రోజ్ ను పట్టుకుని ఉన్నారు. ఈ సినిమాలో తన్వి నేగి హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read: నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలోని పింకీ ప్రస్తుతం ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

Previous articleవిజయశాంతికి ఎన్టీఆర్ ఎందుకు సారీ చెప్పారు..? కారణం ఏమిటో తెలుసా…?
Next articleఅల్లరి నరేష్ భార్య ఎవరు..? ఆమె ఏం చేస్తుంది..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.