Ads
బీసీసీఐ గురించి మనం చెప్పక్కర్లేదు. అందరికీ తెలుసు. బీసీసీఐ క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహిస్తూ ఉంటుంది ప్రతి ఏటా కూడా ఈ బోర్డు కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతోంది. మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకి తాజాగా 48,390 కోట్లు రూపాయలు వచ్చాయి. దేశ క్రీడా బడ్జెట్ కంటే కూడా 15 రెట్లు ఎక్కువ. బీసీసీఐ ఆదాయాన్ని ఇంతలా సంపాదిస్తుంది.
అయితే ఇంత డబ్బు సంపాదించినా కూడా బీసీసీఐ ఎలాంటి ట్యాక్స్ లని కూడా కట్టదు. మరి ఇంత ఉండి కూడా ఎందుకు పన్ను కట్టదు దానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… చాలా మందిలో ఈ సందేహం ఉండే ఉంటుంది. బీసీసీఐ కొన్ని వేల కోట్లు సంపాదిస్తుంది కదా… మరి ఎందుకు ట్యాక్స్ కట్టదు అని.. మరి ఇక ఆ సందేహాన్ని క్లియర్ చేసేసుకోండి…
Ads
బీసీసీఐ సంస్థ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా పన్ను కింద కట్టలేదు కారణం ఏంటి అంటే బీసీసీఐ చారిటబుల్ ట్రస్ట్ కింద రిజిస్టర్ అయింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 12ఏ ప్రకారం ఛారిటబుల్ ట్రస్ట్‌లు ఏ విధమైన ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు. బీసీసీఐ ఛారిటబుల్ ట్రస్ట్‌గా రిజిస్టర్ అవ్వటంతో పన్ను చెల్లించక్కర్లేదు. బీసీసీఐ 1928 డిసెంబర్ నెలలో స్థాపించబడింది.
దాదాపు 94 ఏళ్లుగా బీసీసీఐ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ముంబై లోని వాఖండే స్టేడియానికి సమీపం లో బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ వుంది. బీసీసీఐ మొదటి ప్రెసిడెంట్‌గా గ్రాంట్ గోవన్ వ్యవహరించారు. రోజర్ బెన్నీ ప్రస్తుతం ప్రెసిడెంట్ గా పని చేస్తున్నారు. జే షా సెక్రటరీగా పని చేస్తున్నారు.
ఇకపోతే బీసీసీఐ మీద ఈ మధ్య కాలంలో పలు విమర్శలు రావడాన్ని చూస్తున్నాం. బీసీసీఐ ఐపీఎల్ నిర్వహించటంపై విమర్శలు వస్తున్నాయి. వేల కోట్ల ఆదాయం వస్తున్నా కూడా డబ్బు కోసం బీసీసీఐ ఐపీఎల్ నిర్వహిస్తోందన్న ఆరోపణలు ఈ మధ్య వస్తున్నాయి. కానీ డబ్బు కోసం ఐపీఎల్ నిర్వహించటంలేదని బీసీసీఐ చెప్పేసింది.