రూ.100 నోటుపై ఉన్న పర్వతం పేరు ఏమిటి..? అసలు ఇది ఎక్కడ వుంది అంటే..?

Ads

డబ్బు లేకపోతే ఏమీ లేదు. ఈరోజుల్లో అందరినీ డబ్బే నడిపిస్తుంది. డబ్బులు లేకపోతే అయిన వాళ్లు కూడా కానివాళ్ళు అయిపోతారు. డబ్బు ఉంటే కానివాళ్ళు కూడా అయిన వాళ్ళు అయిపోతుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం భారతదేశంలో కరెన్సీని జారీ చేస్తోంది. కాయిన్స్ అయినా నోట్లయినా సరే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తూ ఉంటుంది.

భారతీయ కరెన్సీ కి దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. మొదట్లో నాణేలు మాత్రమే ఉన్నాయి ఆ తర్వాత నోట్లు వచ్చాయి. నోట్ల కి సంబంధించి అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. తాజాగా చూసుకున్నట్లయితే 2000 రూపాయల నోట్లని విలీనం చేశారు 2000 రూపాయల నోట్లు ఇక మీదట చెల్లవని వాటిని బ్యాంకు లోకి వెళ్లి మార్చుకోవాలని చెప్పిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఇండియన్ కరెన్సీ ని కనుక మనం పరిశీలించి చూస్తే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. భారతదేశంలో అన్ని నోట్ల మీద కూడా గాంధీజీ చిత్రాన్ని ముద్రించడం జరుగుతుంది ఈ విషయం అందరికీ తెలుసు. 1969లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లపై గాంధీ చిత్రాన్ని మొదటిసారి ముద్రించింది. బర్త్ సెంటనరీ మెమోరియల్ డిజైన్ ఈ ఫోటో.

Ads

ఈ ఫోటో వెనుక వైపున సేవాగ్రం ఆశ్రమం ఉంటుంది దానికి ముందు అయితే అశోక స్తంభం ఉండేది. వంద రూపాయల నోట్ల మీద చూసినట్లయితే పర్వతం ఉంటుంది మరి ఆ పర్వతము ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం… చాలామందికి ఈ విషయం తెలియకపోయి ఉండొచ్చు. వంద రూపాయల నోట్లపై ప్రపంచంలోనే మూడవ ఎత్తైన పర్వత శిఖరం అయిన కంచన్ జంగా అనే పర్వతం ఉంది.

సిక్కిం లోని పెల్లింగ్ నుండి దీనిని తీసుకున్నారు. ఈ ఫోటో భారతదేశంలో అత్యంత అందమైనది పైగా చిన్న రాష్ట్రమైన సిక్కిం లోని పెల్లింగ్ నుండి దీనిని తీసుకున్నారు. నేపాలి భాషలో దీన్ని కంచన్ జాంగా అని ఇంగ్లీషులో దీన్ని కంచన్ జాఘా అని అంటారు. లింబు భాషలో అయితే సేవాలుంగ్మా అని అంటారు సిక్కిం రాష్ట్రానికి వాయువ్యంగా నేపాల్ దేశ సరిహద్దుల్లో ఇది ఉంది. 8586 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది ఈ పర్వతం హిమాలయ పర్వత శ్రేణిలో ఇది భాగం.

Previous articleAhimsa movie review: అహింస మూవీ హిట్టా..?, ఫట్టా..?
Next articleవేల కోట్లను సంపాదిస్తున్నా BCCI ఎందుకు ట్యాక్స్ కట్టదు..? కారణం ఏమిటి అంటే..?