Ads
చాలామంది క్రికెట్ ఆటని ఎక్కువగా చూస్తూ ఉంటారు ముఖ్యంగా మన ఇండియా టీం క్రికెట్ ఆడుతోందంటే చాలు టీవీ ని ఆపకుండా కంటిన్యూస్ గా చూస్తూ ఉంటారు. మ్యాచ్ ఎవరు గెలుస్తారా అని ఎంతో ఆసక్తికరంగా చూస్తూ ఉంటారు. అయితే రకరకాల క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయి అన్న విషయం మనకు తెలిసిందే. ఐపీఎల్, వరల్డ్ కప్, టెస్ట్ మ్యాచ్‌లు ఇలా..
అయితే ఎప్పుడు కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ ఇంగ్లాండ్ లోనే జరుగుతాయి. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఎందుకు కేవలం ఇంగ్లాండ్ లోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ ని నిర్వహిస్తారు దాని వెనుక కారణం ఏమిటి..? దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… చాలామందిలో ఈ సందేహం ఉంటుంది.
Ads
ఎందుకు గొప్ప మ్యాచ్ లు అన్నీ కూడా ఇంగ్లాండ్ లోనే జరుగుతాయి అని.. అయితే ఎందుకు జరుగుతాయి అంటే మొదటి కారణం అక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వేసవికాలంలో అక్కడ వాతావరణం మనకి అనుకూలంగా ఉంటుంది. టెస్ట్ క్రికెట్ బాగా జరిగేందుకు ఆ వాతావరణం ఉంటుంది. అందుకని ఇంగ్లాండ్ లోనే ఈ మ్యాచ్ జరుగుతుంది.
రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. వానలు పడినా, వాతావరణంలో మార్పులు వలన ఆటకు ఇబ్బంది కలగడం వంటివి జరగకుండా ఉండేందుకు ఇంగ్లాండ్‌లోనే దీనిని నిర్వహిస్తారు. అలానే ఇంగ్లాండ్ లోనే జరపడానికి మరొక కారణమేంటంటే ఇంగ్లాండ్ కి క్రికెట్ కి ఉండే ప్రత్యేక చరిత్ర. క్రికెట్ కి ఇంగ్లాండ్ కి మధ్య గొప్ప సంబంధం ఉంది.
పైగా క్రికెట్ అక్కడే పుట్టిందని నమ్మకం. పైగా అక్కడ గ్రౌండ్లని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు సదుపాయాలు కూడా బాగుంటాయి. ఇలాంటి పెద్ద మ్యాచ్‌లకి అనువైన సెట్టింగ్ ని అందిస్తుంది. సో ఏ విధంగా చూసినా ఇంగ్లాండ్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి అక్కడ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ ని నిర్వహిస్తారు.