42 ఏళ్ళ నాటి “తిరుమల తిరుపతి” కరపత్రం ని చూసారా..? ఏం వ్రాసి వుంది అంటే..?

Ads

చాలా మంది భక్తులు నిత్యం ఏడు కొండల వేంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి తిరుమల వెళ్తూ వుంటారు. కలియుగ వైకుంఠం తిరుమల లో ఎక్కడ చూసినా కూడా గోవింద నామ స్మరణే. పైగా ఏడు కొండల వేంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు వచ్చే వాళ్ళు వారి శక్తి కొద్దీ కానుకలు కూడా స్వామి వారికి ఇస్తూ వుంటారు.

15 వేల సంవత్సరాల నుంచి తిరుపతిని భక్తులు దర్శనం చేసుకుంటూనే వున్నారు. అయితే రోజు రోజూకి ఎన్నో మార్పులు వస్తాయి. ఈ పదిహేను వేల సంవత్సరాల్లో కూడా చాలా మార్పులు రావడం జరిగింది. కాశి తరవాత ఇదే హిందువులకి అత్యంత పవిత్రమైన ఆలయం.

ఇక్కడ స్వామి వారికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు ని కూడా చేస్తూ వుంటారు. అలానే వాటికి సంబంధించిన పలు కర పత్రాలను కూడా ముద్రిస్తారు. ఇప్పుడు చూస్తే డైరీలు, క్యాలండర్లు కూడా ఉంటున్నాయి. కానీ అప్పుడైతే అలా కాదు. కేవలం కరపత్రాలను మాత్రమే ముద్రించేవారు. ఇదిలా ఉంటే తాజాగా 42 సంవత్సరాల క్రితం ముద్రించిన పామ్ప్లేట్ ఒకటి కనపడుతోంది.

Ads

ప్రస్తుతం అది సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. మరి ఇక ఇంతకీ దానిలో ఏం వుంది అనేది ఇప్పుడు చూసేద్దాం.. 1981 లో ఈ కరపత్రాన్ని ప్రింట్ చేసారు. ఈ కర పత్రం లో హిందువులు ఎటువంటి నియమాలు పాటించాలి, వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనే వాటి గురించి వ్రాసారు. ఆ విషయాలనే ఇప్పుడు మనం చూసేద్దాం.. ప్రతి ఒక్కరు కూడా ప్రతీ రోజు స్నానం చెయ్యాలి. నుదుటిన బొట్టు పెట్టుకోవాలి అని వ్రాసి వుంది. రోజూ దేవుణ్ణి స్మరించుకోవాలి అని వుంది.

ఇంటి ముందు ఓం కారాన్ని రాయాలని కూడా వుంది. సామాజిక ఉత్సవాల్లో పాల్గోవాలని.. వారానికి ఒకసారి దేవాలయాలకు వెళ్లాలని వుంది. ఎక్కువ మందికి సాయం చెయ్యడం మంచిది అని కూడా దానిలో రాసి వుంది. అప్పటి కాలం లో సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు వాళ్ళు చేసిన ఈ పని చూసి సోషల్ మీడియా యూజర్లు షాక్ అవుతున్నారు. కొందరైతే అప్పటి రోజులే మంచివి అని కామెంట్ చేసారు.

Previous articleప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ ని ఎందుకు ఇంగ్లాండ్ లోనే నిర్వహిస్తారు..? కారణం ఏమిటి అంటే..?
Next articleనువ్వేకావాలి హీరోయిన్ రిచా గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందంటే…?