Ads
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. కార్తీకేయ 2 మూవీ తర్వాత నిఖిల్ క్రేజ్ నేషనల్ వైడ్ గా పెరిగిపోయింది. డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ ఆడియన్స్ మెప్పిస్తున్నారు. ఈక్రమంలో స్పై మూవీతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి నిఖిల్ స్పై మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
- సినిమా : స్పై
- నటీనటులు : నిఖిల్ సిద్దార్థ్, రానా దగ్గుబాటి, ఐశ్వర్య మీనన్, ఆర్యన్ రాజేష్, సన్యా ఠాకూర్, అభినవ్ గోమతం తదితరులు.
- నిర్మాత : చరణ్ తేజ్ ఉప్పలపాటి
- దర్శకత్వం : గ్యారీ బీహెచ్,
- ఛాయాగ్రహణం : మార్క్ డేవిడ్, వంశీ పచ్చిపులుసు,
- సంగీతం : విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల,
- విడుదల తేదీ: జూన్ 29, 2023.
స్టోరీ:
జై (నిఖిల్) RAW ఏజెంట్ గా శ్రీలంకలో పనిచేస్తుంటాడు. హత్యక చేయబడ్డాడని భావిస్తున్న కదిర్ ఖాన్ అనే టెర్రరిస్ట్, ప్రధానమంత్రి ఆఫీస్ కు వీడియో పంపడంతో అతను బ్రతికి ఉన్నాడని, తీవ్రవాద కార్యకలాపాల కొనసాగిస్తున్నాడని తెలుస్తుంది. అతన్ని పట్టుకోవడానికి జైని నియమిస్తారు. మరోవైపు తన అన్న సుభాష్ (ఆర్యన్ రాజేష్)ని ఎవరు చంపారు అని వెతుకుతూ ఉంటాడు.
కదిర్ ఖాన్ ను పట్టుకునే క్రమంలో సుభాస్ మరణానికి అతనే కారణం అని తెలుస్తుంది. కదిర్ ఖాన్ పట్టుకోవడానికి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యానికి సంబంధం ఏమిటి? దాన్ని జై ఎలా చేధించాడు అనేది మిగతా కథ.
రివ్యూ:
Ads
ప్రధమార్ధం అక్కడక్కడ డీసెంట్ మూమెంట్స్‌తో ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధ గందరగోళంగా ఉంది. గూఢచారి కథతో రూపొందే సినిమాలకు స్క్రీన్‌ప్లే క్రిస్ప్‌గా, పేసీగా ఉండాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం చుట్టూ ఉన్న వివాదం, నేతాజీకి సంబంధించిన ఎపిసోడ్లు ఆసక్తికరంగా ఉన్నాయి. అది సినిమాకు ప్లస్ అయ్యింది.
స్క్రిప్ట్ పైన ఇంకాస్త వర్క్ చేయాల్సింది. టెర్రరిస్ట్ ఖదీర్ ఖాన్ ఎపిసోడ్స్, ద్వితీయార్ధంలో మరో విలన్ (జిష్షు సేన్‌గుప్తా) ఎంట్రీ ఇస్తాడు. కానీ ఆ క్యారెక్టర్ ను సమర్థంగా చూపించలేకపోయారు. శ్రీచరణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. పాటలు అంతగా ఆకట్టుకోవు. విజువల్ ప్రెజెంటేషన్ రిచ్ అండ్ వైబ్రెంట్ గా కనిపించడంలో మార్క్ డేవిడ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ మంచి క్వాలిటీతో ఉన్నాయి.
స్పై పాత్రలో నిఖిల్ ఒదిగిపోయి, అద్భుతంగా నటించాడు. ఐశ్వర్య మీనన్ ది చిన్న పాత్రను అయినా బాగానే ఉంది. అభినవ్ గోమతం పూర్తి నిడివి పాత్రలో దానికి చక్కగా నటించారు. ఆర్యన్ రాజేష్, మరకండ్ దేశ్ పాండే తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు.
ప్లస్ పాయింట్స్:
- నిఖిల్ సిద్దార్థ్,
- నేతాజీ ఎపిసోడ్లు
- యాక్షన్ సీక్వెన్సులు,
- డైరెక్షన్,
- సినిమాటోగ్రఫీ,
మైనస్ పాయింట్లు:
- ఫ్లాట్ నేరేషన్
- ఓవర్ స్టఫ్డ్ స్టోరీ
- పేలవమైన డైరెక్షన్
రేటింగ్:
2.5/5
watch trailer :