“సామజవరగమన” మూవీ స్టోరీ, రివ్యూ & రేటింగ్…!

Ads

యంగ్‌ హీరో శ్రీవిష్ణు వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్లిన శ్రీవిష్ణు ఇటీవల కాలంలో కాస్త వెనకబడ్డాడు. ఎలాగైన విజయం సాధించాలన్న ఉద్దేశ్యంతో నేడు ‘సామజవరగమన’ తో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

  • సినిమా : సామజవరగమన
  • నటీనటులు :శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ తదితరులు
  • నిర్మాత : రాజేష్ దండా
  • దర్శకత్వం : రామ్ అబ్బరాజు
  • సినిమాటోగ్రఫీ : రాంరెడ్డి
  • సంగీతం : గోపీ సుందర్
  • విడుదల తేదీ: జూన్ 29, 2023.

స్టోరీ:

ప్రేమలో ఫెయిల్ అయిన బాలు (శ్రీవిష్ణు)కు ప్రేమ అంటే నచ్చదు. తనను ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తున్న అంతే ఆమెతో వెంట‌నే రాకీ క‌ట్టించుకుంటుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో బాలుకి స‌ర‌యు (రెబా మౌనికా జాన్‌)తో ప‌రిచ‌యం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో బాలు స‌ర‌యును ప్రేమిస్తాడు.అదే స‌మ‌యంలో బాలు అత్త‌య్య కొడుక్కి సరయు అక్కతో పెళ్లి సెట్ అవుతుంది. దీంతో బాలు, స‌ర‌యు ప్రేమకు పెద్ద అడ్డంకి ఏర్పడుతుంది. ఆ తరువాత వీరి లవ్ స్టోరీలో ఎలాంటి ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి? ఈ మధ్యలో స‌ర‌యు తండ్రి(శ్రీకాంత్ అయ్యంగార్‌) పాత్ర ఏమిటి? బాలు తండ్రి (సీనియ‌ర్ న‌రేష్‌) డిగ్రీ పాస‌యితే కోట్ల ఆస్తి వచ్చేలా బాలు తాత‌య్య రాసిన వీలునామా ఏమిటి? చివరకు ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
రివ్యూ:

Ads

కథ చాలా సింపుల్‌గా ఉన్నా, కొత్తదనం లేకున్నా దర్శకుడు రామ్‌ చక్కటి స్క్రీన్‌ప్లేతో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించాడు. పంచ్‌ డైలాగులతో హిలేరియస్‌ గా స్టోరీని రాసుకున్నాడు.మొత్తం కామెడీ కాకుండా, అవసరమైన చోట కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎమెషనల్‌ సన్నివేశాలను యాడ్‌ చేశాడు.మూవీలోని ప్రతి క్యారెక్టర్ కు కాస్త కామెడీ టచ్‌ ఉంటుంది.
తండ్రిని డిగ్రీ పాస్‌ చేయించడం కోసం హీరో పడే పాట్లతో మూవీ మొదలవుతుంది. ట్యూషన్‌ సెంటర్‌లో సీనియ‌ర్ న‌రేష్‌, హీరోయిన్‌ చేసే కామెడీ, రఘుబాబు అడిగే హిలేరియస్‌ గా ఉంటాయి.కొన్ని సీన్స్ స్లోగా సాగుతాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతూ అంతగా ఆకట్టుకోవు. అలాగే ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్లను పరిచయం చెయ్యడానికి డైరెక్టర్ సమయం ఎక్కువ తీసుకున్నాడు.సినిమాటోగ్రఫీ బాగా ప్లస్ అయింది. చాలా సీన్స్ ను రాంరెడ్డి చాలా అందంగా చిత్రీకరించారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది.
శ్రీవిష్ణు తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు.మధ్యతరగతి తండ్రిగా నరేష్ యాక్టింగ్ హైలైట్ గా నిలిచింది. హీరోయిన్ రెబా మౌనికా జాన్ గ్లామర్ మరియు యాక్టింగ్ తో మెప్పించింది. ఎప్పటిలాగే ముఖ్యమైన పాత్రలలో వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్ కామెడీ టైమింగ్‌ తో నవ్వించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్:

  • శ్రీవిష్ణు నటన,
  • సీనియర్ నరేష్ ట్రాక్,నటన,
  • కామెడీ సన్నివేశాలు,
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్లు:

  • స్లోగా సాగిన కొన్ని సీన్స్,
  • కొన్ని సీన్స్ రెగ్యులర్ గా ఉండడం,

రేటింగ్:

3.25/5

watch trailer :

 

Previous article“స్పై” మూవీ స్టోరీ, రివ్యూ & రేటింగ్…!
Next articleఖమ్మం జనగర్జన సభ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు !
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.