Ads
పెద్దలు చెప్పిన మాట సద్ది మూట అంటారు. కానీ ఈ రోజుల్లో చాలామంది పెద్దలు చెప్పిన మాటను కూరలో కరివేపాకు కంటే దారుణంగా తీసి పక్కన పెడుతున్నారు. చాదస్తాలని ,మూఢనమ్మకాలని కొట్టి పారేయడమే కాకుండా మన సనాతన ఆచారాలను పక్కన పెడుతున్నారు. నిజానికి మనకు ఉన్నటువంటి ఆచారాల వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలా ఉంటాయి. కానీ అవి మనలో చాలామందికి తెలియదు.
మరి ఎక్కువ మాట్లాడితే స్వాతంత్రానికి అడ్డు వస్తున్నారని ,కావాలని అణచివేస్తున్నారని ,తారతమ్యాలు చూపిస్తున్నారని… సినిమా డైలాగులు చెబుతారే తప్ప వాటి వెనక ఉన్న ఆంతర్యం ఏమిటా అని ఆగి ఒక్క నిమిషం ఆలోచించాలి అన్న అవగాహన ఎవరికి లేదు. ఇటువంటి ఆచారాలలో ఒకటే రోజు స్త్రీలు చేతికి గాజులు , కాలికి మెట్టెలు , మెడలో మంగళ సూత్రాలు వంటివి ధరించాలి అనేది.
చాలామందికి ఇది అవుట్ డేటెడ్ ఫ్యాషన్. ఈ మధ్యకాలం మహిళలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముత్తైదువుతనానికి మూలమైనటువంటి ఈ చిహ్నాలు ధరించకుండా అశ్రద్ధ చేస్తున్నారు. అదే మన ఇంట్లో అమ్మను, అమ్మమ్మను చూడండి…వాళ్లు ఎప్పుడూ ఈ ఆభరణాలను ధరించి నిండు ముత్తయిదుల్లా కలకలలాడుతూ ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు వాటిని వంటి మీద నుంచి తీసి పక్కన పెట్టారు.
Ads
మన సనాతన సాంప్రదాయాలలో సైన్స్ కు కూడా అందనటువంటి ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి. ముత్తయిదువుకి ఉండే ఐదు లక్షణాలలో ఒకటి గాజులు వేసుకోవడం. శ్రీమంతం సమయంలో కూడా గాజులు వేయడం అనేది ఒక ప్రధాన ఆచారంగా చేశారు. మరి దీని వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటో తెలుసా?గాజులు అనేది కేవలం అలంకరణ కోసం వాడే వస్తువు కాదు అది ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.
స్త్రీలు గాజులు ధరించడం వల్ల వారి శరీరంలో రక్తప్రసరణ చురుకుగా జరుగుతుంది…చేతులు కదిపినప్పుడు గాజులు అటు ఇటు కదలడం వల్ల మనికట్టు భాగంలో తెలియని మసాజ్ వంటి ప్రక్రియ జరిగి రక్త ప్రసరణ బాగా జరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. మన గర్భాశయానికి సంబంధించిన ఎన్నో నాడులు మణికట్టుకు మరియు ముంజేతికి మధ్య లింక్ అయి ఉంటాయట. కాబట్టి మనికట్టుకు గాజులు ధరించడం వల్ల గర్భాశయంలోని నాడులు ఉత్తేజితమై గర్భాశయం చురుకుగా పనిచేస్తుంది.
అమ్మాయిలు….ఎవరో చెప్పారని కాకపోయినా కనీసం మీ ఆరోగ్యం కోసమైనా తప్పక గాజులు ధరించండి.