హీరోగా బాలకృష్ణ ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ పేపర్ క్లిప్ వైరల్

Ads

నటసింహ నందమూరి బాలకృష్ణకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎటువంటి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఒక్క డైలాగ్ వేస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే…అలాంటి నందమూరి అందగాడు ఆరు పదుల వయసులో కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. నందమూరి నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ తనదైన ప్రత్యేకమైన శైలితో ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్నారు.

రీసెంట్గా సంక్రాంతికి వీర సింహారెడ్డి మూవీతో వీర విహారం చేసి ప్రస్తుతం భగవంత్ కేసరిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. బాలయ్యకు తగినట్టుగానే ఈ మూవీ ఓ రేంజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా బాలకృష్ణ హీరోగా ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ కు సంబంధించిన పత్రికలో ప్రచురించబడి నటువంటి పేపర్ కటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Ads

తాను నటుడిగా నేర్చుకోవాల్సింది ఇంకా ఉందని.. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకోవాలి అని ఆశిస్తున్నానని బాలయ్య పేర్కొన్నారు. అంతేకాకుండా తండ్రి పోలికలు వచ్చినంత మాత్రాన తన తండ్రి లాగా తనని చూడాల్సిన పనిలేదని.. తనలో ఒక ప్రత్యేక నటుడు ఉన్నాడు ,అతడు సమయం వచ్చినప్పుడు బయటపడతాడని బాలయ్య అన్నారు. నటన పట్ల బాలయ్యకు ఉన్నటువంటి అభిలాషతో పాటు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలి అని కోరిక అతని ఇంటర్వ్యూలో స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ పేపర్ కటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ అది ఏ వార్తాపత్రికకు సంబంధించింది అన్న వివరాలు తెలియదు. ప్రస్తుతం ఫ్యామిలీతో అమెరికాకు వెకేషన్‌కు వెళ్ళిన బాలయ్య తిరిగి వచ్చిన వెంటనే భగవంత్ కేసరి షూటింగ్‌లో
పాల్గొంటారు. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయం కాబట్టి ఇటు ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన బిజీగా ఉంటారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ సాలిడ్ హీట్ అవ్వాలని బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్నారు.

.

Previous articleవందే భారత్ ట్రైన్ వెనుక ‘X’ గుర్తు ఎందుకు లేదో మీకు తెలుసా?
Next articleగాజులు వేసుకోమని పెద్దలు చెప్పడం వెనక ఉన్న సైంటిఫిక్ రీసన్ మీకు తెలుసా?