Ads
ఎప్పుడైనా మీరు ట్రైన్ ఎక్కేటప్పుడు వెనక ఉండే ‘X’ గుర్తు గమనించారా?అసలు ఇది ఎందుకు ఉంటుంది అన్న అనుమానం ఎప్పుడైనా మీకు కలిగిందా? రైల్వే ప్రమాదాలు జరగకుండా నివారించడం కోసం ఇండియన్ రైల్వేస్ తీసుకుని పలు భద్రత ప్రమాణాలలో ఇది కూడా ఒకటి. ప్రతి రైలుకు చివరి భోగి వెనుక కనిపించే ఈ ‘X’ గుర్తు వందే భారత్ ట్రైన్ కి మాత్రం లేకపోవడం విశేషం. అయితే దీని వెనుక ఉన్న కారణం ఏమిటో మీకు తెలుసా?
సరుకుల రవాణా దగ్గర నుంచి వ్యాపార, వాణిజ్యం వరకు…టూర్ కి వెళ్లే దగ్గర నుంచి రోజువారి ఉద్యోగాలకు వెళ్లే వరకు.. ఎంతోమంది రైల్వే సేవలపై ఆధారపడి ఉంటారు. ఇటువంటి వారి కోసం హై స్పీడ్ రైళ్లను నడపడంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించి ,సురక్షితంగా గమ్యానికి చేర్చడానికి రైల్వే సంస్థ వందే భారత్ పేరిట సెమీ హై స్పీడ్ ట్రైన్స్ ను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలుమార్గాలలో ప్రవేశపెట్టినటువంటి ఈ వందే భారత్ ట్రైన్స్ వెనుక మిగిలిన ట్రైన్స్ కి ఉన్నట్టుగా ‘X’ గుర్తు ఉండదు.
Ads
మిగిలిన అన్ని ట్రైన్స్ వెనక ఉన్నాయి గుర్తు రైలులోని చివరి భోగికి సూచన. ఒకవేళ ఈ గుర్తు వున్న భోగి కనిపించకపోతే ఏదో ప్రమాదం జరిగిందని రైలు నుంచి బోగీలు విడిపోవడం లాంటి పరిస్థితి ఏర్పడిందని అధికారులు గుర్తించడం కోసం ఈ సింబల్ ను ఉంచుతారు. అయితే ఈ హై స్పీడ్ ట్రైన్ కంప్లీట్ గా అటాచ్డ్ గా ఉంటుంది కాబట్టి మధ్యలో ఎక్కడా బోగీలు మిస్సయ్యే ఆస్కారం ఉండదు. పైగా ఇది రెండు వైపుల నుంచి ప్రయాణిస్తుంది. ఈ కారణం చేత ఈ ట్రైన్ కు ‘X’గుర్తు ఉంచలేదు. దీనితో పాటుగా వందే భారత ట్రైన్స్ లో రైల్వే సురక్ష కవచ్ అనే భద్రతా ఫీచర్ ని కూడా పొందుపరచడం జరిగింది. ఈ ఫీచర్ కారణంగా పొరపాటున రెండు రైళ్లు ఒకే ట్రాక్ లోకి వచ్చినప్పుడు ఢీకొనకుండా ప్రమాదాన్ని నివారించే ఆస్కారం ఉంటుంది.