Ads
మన దేశంలోనే కాదు మొత్తం ఆసియా ఖండంలో అతి పెద్ద రవాణా సదుపాయాన్ని కలిగించే సంస్థ రైల్వే సంస్థ. దూర ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి అనుకూలంగానే కాకుండా బడ్జెట్లో ఉండే సర్వీస్ ట్రైన్ సర్వీస్. అందుకే రోజుకు లక్షలమంది ఈ ట్రైన్లను ఉపయోగించుకొని తమ గమ్యాలను చేరుతూ ఉంటారు.
ప్రయాణికులకు సౌకర్యవంతమైన మరియు క్షేమమైన రవాణా సదుపాయం కలిగించడం కోసం రైల్వే శాఖ కొన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు తగు జాగ్రత్తలను కూడా తీసుకుంటూ ఉంటుంది. కానీ మనం రోజు ప్రయాణించే ఈ ట్రైన్స్ గురించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఏసీ ఖర్చులు రైలుకి మధ్య భాగంలో రావడం కూడా ఇటువంటి ఆసక్తికరమైన విషయాల్లో ఒకటి.
Ads
రైల్లో ఏసీ బోగీలను మొదట్లో లేక చివరిలో పెట్టకుండా మధ్యలో పెట్టడం వెనక కూడా ఓ పెద్ద కారణం ఉంది. ట్రైన్ లో మామూలుగా జనరల్ కోచ్ ఆ తర్వాత స్లీపర్ కు వస్తుంది. కానీ అన్ని ట్రైన్స్ కి మధ్యలో ఏసీ కోచ్‌లు వస్తాయి. ప్రతి స్టేషన్లో ఈ ఏసీ కోచ్ లో ఎక్కే వారి సంఖ్య తక్కువ కాబట్టి ఎక్కే ప్రదేశంలో రద్దీ ఉండదు. అదే మామూలు జనరల్ మరియు స్లీపర్ కంపార్ట్మెంట్ల విషయంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది.
మీరు గమనించినట్లయితే రైల్వే స్టేషన్ ఎగ్జిట్ గేట్ కూడా సాధారణంగా మధ్యలోకి ఉంటుంది. ఏసీ కోచ్ నుంచి దిగిన ప్రయాణికులు లగేజ్ తో ఇబ్బంది పడకుండా ఎగ్జిట్ దగ్గరకు సులభంగా రావడం కోసమే ఈ కోచ్ లను ట్రైన్ కి మధ్యలో వచ్చేట్టుగా ఏర్పాటు చేసినట్లు మనం గమనించవచ్చు. దీని వెనుక ఇంకొక ఆసక్తికరమైన కారణం కూడా కనిపిస్తుంది. మొట్టమొదట బ్రిటిష్ వాళ్లు రైళ్లను నడిపేటప్పుడు అవి స్టీమ్ ఇంజన్లతో నడిచేవి. ఇండియన్ సౌండ్స్ కారణంగా ఏసీ కోచ్ లోని ప్రయాణికులు ఇబ్బంది పడకూడదు అని వాటిని ఇంజన్ కి దూరంగా పెట్టినట్లు తెలుస్తుంది. అప్పటి అరేంజ్మెంట్ కొనసాగుతూ వచ్చి కూడా ఉండవచ్చు.