Ads
చాలా మంది అడ్వకేట్, లాయర్ ఒకరే అనుకుంటారు. అయితే మరి నిజంగా లాయర్ అడ్వకేట్ ఒకరేనా..? లేదంటే లాయర్ కి అడ్వకేట్ కి ఏమైనా తేడా ఉందా..? ఇద్దరు ఒకరే అనుకుని చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు కానీ ఇద్దరు వేరు. అయితే మరి అసలు అడ్వకేట్ అంటే ఎవరు..?, లాయర్ అంటే ఎవరు..? వారి మధ్య తేడా ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
లాయర్ అడ్వకేట్ ఇద్దరూ ఒకళ్ళే కదా అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. బైజూస్ ప్రకారం వచ్చిన సమాచారం ప్రకారం అడ్వకేట్, లాయర్ మధ్య తేడాను ఇప్పుడు తెలుసుకుందాం.
లయర్స్ న్యాయపరమైన సలహాలను మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళు కేవలం లా కోసం చెబుతారు. కానీ కోర్ట్ లో క్లయింట్ కోసం వాదించేందుకు కుదరదు. అదే అడ్వాకెట్ అయితే క్లయింట్ కోసం వాదించచ్చు. అలానే అడ్వాకెట్ కి ఎక్స్పీరియెన్స్ ఎక్కువ. అడ్వకేట్ కి ఎక్కువ డబ్బులిస్తారు. లాయర్ ఫీజ్ తక్కువగా ఉంటుంది.
Ads
ఎవరైనా సరే ”లా” చదివేసి.. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా డిగ్రీ ని పొందితే వాళ్ళని లాయర్ అనాలి. అలానే స్టేట్ బార్ కౌన్సిల్ లో ఇండియా లో ఎవరైనా లాయర్ దగ్గర కానీ లా గ్రాడ్యుయేట్ కోర్ట్ లో ప్రాక్టీస్ కోసం ఎన్రోల్ చేసుకోవాలి. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ని కంప్లీట్ చేసుండాలి. వాళ్ళు నెక్స్ట్ అడ్వకేట్ దగ్గర ప్రాక్టీస్ చేస్తారు. ఇక అడ్వాకెట్ ఎవరంటే… ఎవరైతే LLB డిగ్రీ ని పొంది.. బార్ ఎగ్జామినేషన్ పూర్తి చేస్తారో వాళ్ళని అడ్వకేట్ అంటారు.
ఇక బారిష్టర్ అంటే ఏమిటనేది చూస్తే.. చాలా మంది విదేశాలకి వెళ్లి చదువుతారు. ఇంగ్లాండులో లో కానీ స్కాట్ ల్యాండ్ లేదా సౌత్ ఆఫ్రికాలో లా చదివి వచ్చారంటే వాళ్ళని బారిష్టర్ అంటారు. బారిస్టర్ కూడా అడ్వకేట్ లానే.