చిరంజీవి హీరోయిన్ ఏంటి ఇప్పుడు ఇలా అయిపోయింది.. ఆమె వేల కోట్లకి అధిపతి అని మీకు తెలుసా..?

Ads

మెగాస్టార్ చిరంజీవి ఎంతో మంది హీరోయిన్ల తో నటించారు చాలా మంచి హిట్స్ ని కూడా మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. నిజానికి ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ కాలం నిలవలేరు. అవకాశాలు అలా వస్తూ వుంటాయని మనం చెప్పలేము. కొంత మంది నటులు అయితే ఏవో కారణాల వలన ఇండస్ట్రీ నుండి దూరం అవుతూ ఉంటారు. కొంత మంది యాక్టర్లు ఇండస్ట్రీకి దూరమైన తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి మళ్లీ ఇండస్ట్రీ లో అప్పటి లాగే బిజీ అయిపోతూ ఉంటారు.

అప్పుడప్పుడు ఇండస్ట్రీ నుండి దూరమైన సెలబ్రిటీల ఫోటోలు సోషల్ మీడియాలో షికార్లు కొడుతూ ఉంటాయి. చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించిన మాధవి మీకు గుర్తే అనుకుంటా.. ఈమె మెగాస్టార్ చిరంజీవి సరసన నటించారు. కుక్కకటుకు చెప్పు దెబ్బ, ఖైదీ, బిగ్ బాస్, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ప్రాణం ఖరీదు, కోతల రాయుడు మొదలైన సినిమాల్లో నటించి అందరిని మెప్పించారు. ఈమె అసలు పేరు కనక విజయలక్ష్మి.

Ads

కానీ మాధవి గా ఇండస్ట్రీ లోకి వచ్చింది. తెలుగులోనే కాదు మలయాళం, హిందీ , తమిళం మరియు కన్నడ చిత్రాలలో కూడా ఈమె నటించి అందరినీ ఆకట్టుకుంది. దాదాపు 2 దశాబ్దాల కెరీర్‌ లో దాదాపు 300 చిత్రాలలో ఈమె నటించింది. 1980లలో దక్షిణ భారత చలనచిత్ర ప్రముఖ నటీమణులలో ఒకరిగా పాపులర్ అయింది.  ఈమె మాతృదేవోభవ సినిమాలో నటించి అందరిని ఏడిపించేసారు.

అప్పట్లో ఒక పెద్ద నటిగా ఈమె గుర్తింపుని తెచ్చుకున్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు మాధవి. మాధవి ఆ తర్వాత ఒక బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకున్నారు. ఆయన పేరు రాల్ఫ్ శర్మ.

పెళ్లి అయిన తర్వాత మాధవి అమెరికా లోనే సెటిల్ అయ్యారు. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. తన భర్త మొదలు పెట్టిన రెస్టారెంట్స్ ని బిజినెస్ లని ఈమె చూసుకుంటూ ఉంటారు వేల కోట్ల ఆస్తులని ఈమె సంపాదించారట ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది చూసిన మాధవి లత ఫ్యాన్స్ ఈమె ఏంటి ఇలా అయిపోయిందంటూ అవాక్ అవుతున్నారు.

Previous articleఇండియా మ్యాప్ లో చైనా, పాకిస్థాన్ ఉండవు.. కానీ శ్రీలంక ఎందుకు ఉంటుంది..? ఇంత పెద్ద రీజన్ ఉందా..?
Next article“లాయర్” కి “అడ్వకేట్” కి తేడా ఉందా..? ఇద్దరు ఒకరేనా..? మరి రెండు పదాలు ఎందుకు..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.