వేసవికాలంలో కుండలో నీళ్లు చల్లగా ఎందుకు ఉంటాయి..? దానికి కారణం ఏంటి ?

Ads

వేసవికాలం అంటేనే విపరీతంగా దాహం కలుగుతుంది. అందుకని ఫ్రిడ్జ్ లోని వాటర్ లేదు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్యానికి లేనిపోని సమస్యలు వస్తాయి. ఇవి తాగేటప్పుడు చల్లగా ఆహ్లాదంగా ఉన్నప్పటికీ శరీరానికి విపరీతమైన హాని కలిగిస్తాయి.

With mercury soaring, earthen pots make a comeback | Mysuru News - Times of India

అందుకే వేసవికాలం ఎప్పుడు కుండలో నీళ్లు తాగడం శ్రేయస్కరం అంటారు. కుండలో నిల్వ చేసిన నీరు 100% ప్యూరిఫై చేసిన వాటర్ తో సమానం. అంతేకాకుండా కుండలో నిల్వచేసిన నీరు తాగడం వల్ల ఎసిడిటీ లాంటి సమస్యలు ఉత్పన్నం కావు.

అయితే కుండలో నీళ్లు చల్లగా ఉండడానికి వెనక ఒక పెద్ద మెకానిజం దాగి ఉంది. కుండను జాగ్రత్తగా గమనించినట్లయితే అది చిన్నచిన్న రంధ్రాలతో నిండి ఉంటుంది. లోపల నిల్వ చేసినటువంటి నీరు ఈ చిన్ని రంధ్రాల గుండా కొద్దికొద్దిగా బయటకు వచ్చి క్రమంగా అయిపోతుంది.

Ads

ఈ ఆవిరి ప్రక్రియకు అవసరమైనటువంటి వేడిని అవి కుండలో ఉన్నటువంటి నీటి నుంచి గ్రహిస్తాయి.ఇలా కుండలో ఉన్న నీటి నుంచి వేడి మొత్తం బయటకి ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి కుండలో నీళ్లు చల్లబడతాయి.

పచ్చి మట్టితో తయారుచేసిన కుండను ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత మధ్య పట్టీలలో కాలుస్తారు కాబట్టి వాటికి అతి సూక్ష్మమైన రంధ్రాలు ఏర్పడతాయి. వీటి కారణంగానే కుండా లోని నీళ్లు చల్లగా ఉంటాయి. అంతేకాకుండా కుండలో నీళ్లు తాగడం వల్ల శరీరంలోని ఉష్ణం తగ్గడమే కాకుండా దాహం కూడా తీరుతుంది.

అదే ఫ్రిడ్జ్ వాటర్ తాగడం వల్ల తాత్కాలికంగా చల్లదలం కలిగినప్పటికీ అది శరీరంలోని ఉష్ణ శాతాన్ని విపరీతంగా పెంచుతుంది.

Previous articleనాగార్జున నుంచి నాగచైతన్య వరకు విడిపోయిన సినీ కపుల్స్ …
Next articleపవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ వెనక కారణం ఆ వ్యక్తి..!