Ads
సినిమాల్లో నటించడం అంటే కనిపించినంత ఈజీ కాదు. చాలాసార్లు మూవీస్ లో చేయడం కోసం హీరో హీరోయిన్స్ తమ ఇష్టా ఇష్టాలను కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. పాత్రకు తగినట్లుగా ఉండడం కోసం ఎంతో అంకితభావంతో పని చేస్తారు కొందరు స్టార్స్. ఈ క్రమంలో తాము నటించే పాత్రల కోసం కొన్ని సందర్భాలలో అవసరం అయితే నాన్ వెజ్ సైతం మానేసిన వారు ఉన్నారు. ముఖ్యంగా సినిమాలో దేవుడి పాత్రకు సంబంధించి నటించే సమయంలో నటీనటులు పలు సందర్భాలలో నాన్ వెజ్ మానేసి షూటింగ్ జరిగినన్ని రోజులు దీక్షలో గడిపారు. అలా సినిమాల కోసం నాన్ వెజ్ మానేసిన నటుల గురించి తెలుసుకుందాం…
సీనియర్ ఎన్టీఆర్:
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పక్కర్లేదు. రాముడైనా ,భీముడైన, కృష్ణుడైన అర్జునుడైన.. ఎన్టీఆర్ ప్రతి పాత్రను మెప్పించే శక్తి ఉన్న నటుడు. తన కెరీర్ లో ఎన్నో పౌరాణిక చిత్రాలు చేసిన ఎన్టీఆర్ ఆ సమయాలలో పూర్తిగా నాన్ వెజ్ కి దూరంగా ఉండటమే కాకుండా ఎంతో నిష్టగా ఆ పాత్రలను చేసేవారట.
నాగార్జున:
అన్నమయ్య దగ్గర నుంచి భక్త రామదాసు వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించిన నాగార్జున షిరిడి సాయి గా కూడా అందరినీ మెప్పించారు. ఈ మూవీస్ కి సంబంధించి షూటింగ్ జరిగేటప్పుడు నాగార్జున పూర్తి దీక్షలో ఉంటూ శాఖాహారిగా ఉన్నారు.
Ads
అల్లు అర్జున్:
దువ్వాడ జగన్నాథం అంటూ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఆ సినిమాలో బ్రాహ్మణ క్యారెక్టర్ పోషించారు. వారిపై ఉన్న గౌరవం కొద్దీ ఆ సినిమాలో నటించినన్ని రోజులు అల్లు అర్జున్ ఎటువంటి నాన్ వెజ్ తీసుకోకుండా పూర్తిగా శాకాహారిగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్:
రీసెంట్ గా విడుదలైన పవర్ స్టార్ మరియు సాయిధరమ్ తేజ కాంబో మూవీ బ్రో. ఇందులో దేవుడి పాత్రలో నటించిన పవన్ ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేంతవరకు నియమ నిష్ఠలతో దీక్ష పాటించారు.
రిషబ్ శెట్టి:
కాంతారావు సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన రిషబ్ శెట్టి ఈ మూవీలో దైవకోలా సీక్వెన్స్ షూటింగ్ జరిగిన 30 రోజులు నాన్ వెజ్ పూర్తిగా మానేశారట.
అక్షయ్ కుమార్:
బాలీవుడ్ కండల వీరుడు అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 మూవీలో నటిస్తున్నారు. దీనికి సీక్వెల్ గా వచ్చిన ఓ మై గాడ్ చిత్రంలో అక్షయ్ కృష్ణుడు కనిపిస్తే ఇప్పుడు శివుడి పాత్రలో నటిస్తున్నారు. దేవుడి పాత్రలు చేసేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు అని ఆయన తల్లి చెప్పిన మాటల కారణంగా ఈ రెండు చిత్రాల షూటింగ్ సమయంలో అక్షయ పూర్తి శాకాహారిగా మారిపోయాడు.