Ads
పెళ్లి తర్వాత జీవితానికి ఒక మంచి తోడు వస్తుంది. జీవితాంతం కలిసి ఆనందంగా జీవించడానికి ఒక వ్యక్తి మన జీవితం లోకి వస్తారు. అయితే పెళ్లి తరవాత చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా పెళ్లి తరవాత ఆడవాళ్ళలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆడవాళ్ళ అలవాట్లు, పద్ధతులు కూడా మారుతాయి. అలానే ఆడవాళ్ళూ పెళ్లయ్యాక మట్టిగాజులు వేసుకుంటారు. ముక్కుపుడక పెట్టుకుంటారు.
కాళ్లకు మెట్టెలు, తాళి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా నిన్నో మొన్నో వచ్చిన పద్ధతులు కావు. తరతరాల నుండి ఆచరిస్తున్నవే. హిందూ ధర్మంలో అయితే వివాహం అయిన స్త్రీలని లక్ష్మి దేవిగా భావిస్తారు.
స్త్రీ వేసుకునే ప్రతీ దాని వెనుకా కూడా ఓ అర్ధం వుంది. పెళ్లి లో వరుడు వధువుకి తాళి కట్టిన తర్వాత వరుడు మెట్టలని పెడుతూ ఉంటారు. నిజానికి పెళ్ళిలో చాలా ముఖ్యమైన తంతులు ఉంటాయి. ఈ తంతులు అన్నిటిని కూడా పూర్తి చేస్తూ ఉంటారు. మెట్టెలు ధరించడం వెనుక ఆచారమే కాదు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. మెట్టెలు ఆడవాళ్లు ఎందుకు వేసుకోవాలి దీని వెనక కారణం ఏమిటి అనే దాని గురించి చూద్దాం.
Ads
#1. ఆడవారి బొటనవేలు నేలకి డైరెక్ట్ గా తగలకూడదు. కాలి బొటనవేలు పక్కనున్న వేలు కూడా స్త్రీలకు ఆయువుపట్టు. అయితే దీని నుండి విద్యుత్ ప్రసరిస్తుంటుంది. కాబట్టి ఈ వేళ్ళు నేలకి తగలడం మంచిది కాదు అందుకనే ఇలా తగలకూడదని మెట్టెలు ధరించే సంప్రదాయాన్ని తీసుకువచ్చారు. దీని కారణంగానే పెళ్లి లో మెట్టెలు పెడతారు.
#2. అలానే బొటనవేలు మరియు పక్కనున్న వేలు గర్భాసయానికి సంబంధం కలిగి ఉంటుంది. మెట్టెలు పెట్టుకోవడం వలన గర్భాశయ ఆరోగ్యం మెరుగు పడుతుంది. జననేంద్రియాల సమస్య నుండి బయటపడడానికి అవుతుంది.
#3. గర్భాశయం కూడా మెట్టెల వలన దృఢంగా ఉంటుంది. మెట్టెలు ఆక్యు ప్రెషర్ లాభాలని కలిగి ఉంటాయి.
#4. సంతాన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.
#5. రీప్రొడక్టివ్ సిస్టం కూడా సరిగ్గా ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
#6. పైగా ప్రకృతిలో ఉండే పాజిటివ్ ఎనర్జీ వెండి మెట్టల వలన వస్తుంది. సుఖ ప్రసవం సంతాన అభివృద్ధికి మెట్టెలు, గాజులు ఉపయోగపడతాయి.