పెళ్లికూతురు మీద చేయి వేయమంటే… ఈ అబ్బాయి ఏం చేశాడో చూస్తే నవ్వాపుకోలేరు..! ఇలా కూడా ఉంటారా..?

Ads

మనుషులు అన్నాక పొరపాట్లు చేయడం అనేది సహజం. కొన్ని పొరపాట్లు సీరియస్ గా ఉంటే, కొన్ని పొరపాట్లు మాత్రం నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. ఆ సమయంలో కొంచెం షాకింగ్ గా అనిపించినా కూడా తర్వాత అవన్నీ చూస్తే నవ్వొస్తాయి. అయితే సోషల్ మీడియాలో ఇలా కొంత మంది పొరపాటులో చేసిన కొన్ని పనులకు సంబంధించిన వీడియోలు చూస్తూ ఉంటాం. ఇటీవల అలా ఒక సంఘటన జరిగింది. ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఆ అబ్బాయి చేసిన పనికి నవ్వుతున్నారు.

couple funny video during wedding photography

ఈ పొరపాటు ఎక్కడో కాదు ఒక పెళ్లిలో జరిగింది. అది కూడా ఆ అబ్బాయి పెళ్లిలోనే జరిగింది. పెళ్లయ్యాక ఫోటోలు దిగడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఈమధ్య డిఫరెంట్ పోసెస్ తో ఫోటోలు దిగుతున్నారు. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా కొత్తగా ఆలోచించి ఫోటోలకి డిఫరెంట్ కాన్సెప్ట్ లు తీసుకొస్తున్నారు. ఇవన్నీ చాలా పెద్ద హిట్ అవుతున్నాయి. అయితే ఇటీవల అలా ఒక పెళ్లిలో ఒక అబ్బాయి చేసిన పనికి మాత్రం చాలా మంది నవ్వుతున్నారు. అదేంటంటే, ఆ అబ్బాయిని అమ్మాయి మీద చేయి వేయమని చెప్పాడు ఫోటోగ్రాఫర్.

couple funny video during wedding photography

Ads

కానీ ఆ అబ్బాయి మాత్రం స్కూల్ లో డ్రిల్ లో చేసినట్టు తన భుజం మీద తనే చేయి వేసుకున్నాడు. ఆ ఫోటోగ్రాఫర్, “భుజం మీద చేయి వేయండి” అని చెప్పాడు అంతే. కానీ ఆ అబ్బాయికి మాత్రం తన భుజాల మీద తననే చేయమన్నట్టు అర్థం అయ్యింది. దీంతో ఆ పెళ్లికూతురు బిత్తరపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది. తర్వాత ముందుకి నడవమని ఫోటోగ్రాఫర్ చెప్పాడు. దాని అర్థం, ఆ అమ్మాయి భుజం మీద చేయి వేసి ముందుకు నడవమని. కానీ ఆ అబ్బాయి మాత్రం అమ్మాయిని పట్టించుకోకుండా తను ముందుకు నడవడం మొదలుపెట్టాడు.

couple funny video during wedding photography

ముందు భుజం మీద చేయి వేయమంటే అలా చేసి, ఇప్పుడు ఇలా ఇంకొక పొరపాటు చేశాడు. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేశారు. ఆ అబ్బాయి చేస్తున్న పనులకు ఏం చేయాలో తెలియక ఆ అమ్మాయి అయోమయంలో పక్కకి వెళ్ళిపోయింది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా, “ఈ అబ్బాయి చదివిన స్కూల్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు అనుకుంటా. అందుకే డ్రిల్ లో చేసినట్టు చేస్తున్నాడు” అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

watch video :

ALSO READ : చిరంజీవి పక్కనే నిలబడ్డ ఈ అబ్బాయి ఇప్పుడు ఇండస్ట్రీలోనే టాప్ హీరో అయ్యాడు..! ఎవరో తెలుసా..?

Previous articleగర్భం దాల్చడానికి కాలి మెట్టెలకి ఇంత సంబంధం ఉందా..?
Next articleజీడిపప్పు ని తీసుకుంటే.. ఈ 6 సమస్యలకి దూరంగా ఉండచ్చు..!